Andhra: స్వర్ణాంధ్ర దిశగా పన్నెండో అడుగు.. పడుతూ లేస్తూనే ప్రగతి వైపు..!
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాజధాని లేకుండా ప్రారంభమైన రాష్ట్ర ప్రయాణం రాజకీయ మార్పులు, పాలనా విధానాల ప్రభావంతో ఎన్నో మలుపులు తిరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణం, భారీ పెట్టుబడుల ఆకర్షణ, పోలవరం ప్రాజెక్టు పురోగతి, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను ప్రభుత్వం విజయాలుగా చెబుతోంది.

వరుసగా మూడోసారి విక్టరీ కొట్టి దిగ్విజయంగా పన్నెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం. పుష్కరసంబరంలో మునిగి తేలుతోంది కమలం పార్టీ. మోదీ హయాంలో వికసిత్ భారత్‌కు బలమైన పునాది పడిందని సర్టిఫై చేస్తోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా పన్నెండేళ్ల మైలురాయిని దాటింది. రాజధాని లేని రాష్ట్రంగా విడిపడి పుష్కరకాలం గడిచింది. కాకపోతే, ఈ పన్నెండేళ్లలో కేంద్రంలో రాజకీయ స్థిరత్వం కారణంగా మోదీ నాన్‌స్టాప్‌గా గెలుస్తూ వచ్చారు. రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు తిరగబడి, ప్రభుత్వాలు మారి.. దాని ప్రభావం రాష్ట్ర ప్రగతిపై డైరెక్టుగా పడింది. పార్టీ విధానాలకు తగ్గట్టు పాలనా నిర్ణయాలు మారి, ఎవరి పాలసీలు వాళ్లు అమలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ అనేక వంకర్లు తిరిగింది. ఇప్పుడు కూటమి పవర్లోకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రం స్టేటస్ రిపోర్ట్‌పై ఘాటుగా చర్చ జరుగుతోంది. తొలినాళ్లను రీకాల్ చేసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటూ, తెలంగాణ సీఎం మాటతో మొదలుపెట్టడం ఏంటి అని సందేహం రావొచ్చు. కానీ, ఇది ఇక్కడ సరిగ్గా అతికిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60 శాతానికి పైగా సైబరాబాద్ నుంచే వస్తోంది అని స్వయానా సీఎం రేవంత్‌రెడ్డే స్టేట్‌మెంట్ ఇచ్చారంటే ఫైనాన్షియల్‌గా హైదరాబాద్‌కున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణకు మేజర్ రెవెన్యూ సోర్స్ భాగ్యనగరమే అనే లెక్కయితే ఇప్పటికీ పక్కాగా ఉంది. హైదరాబాద్‌ను ఇంకా అభివృద్ధి చేయాలి, లక్ష కోట్లివ్వండి అని నిన్నగాక...
