బ్రేకింగ్ : సమ్మర్ ఎఫెక్ట్.. గయలో 144 సెక్షన్

144 సెక్షన్‌ అంటే సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు ఎదురైతే సంబంధిత ప్రభుత్వం 144 సెక్షన్ విధిస్తుంది. కానీ బీహార్‌లోని గయలో మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించింది. ముఖ్యంగా ఔరంగాబాద్, గయ, నవాడా జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా గయలో అత్యధికంగా 46 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వచ్చాయి. ఈ ఎండల కారణంగా వడదెబ్బకు గురై 184 మంది మృత్యువాత పడ్డారు. దీంతో […]

బ్రేకింగ్ : సమ్మర్ ఎఫెక్ట్.. గయలో 144 సెక్షన్
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 10:40 AM

144 సెక్షన్‌ అంటే సాధారణంగా ఎక్కడైనా అల్లర్లు, ఆందోళనకర పరిస్థితులు ఎదురైతే సంబంధిత ప్రభుత్వం 144 సెక్షన్ విధిస్తుంది. కానీ బీహార్‌లోని గయలో మాత్రం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 144 సెక్షన్ విధించింది. ముఖ్యంగా ఔరంగాబాద్, గయ, నవాడా జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని రోజులుగా గయలో అత్యధికంగా 46 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వచ్చాయి. ఈ ఎండల కారణంగా వడదెబ్బకు గురై 184 మంది మృత్యువాత పడ్డారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ప్రజల సంచారంపై బీహార్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బహిరంగ ప్రదేశాల్లో తిరగడాన్ని బ్యాన్ చేశారు. అంతేకాకుండా ఈ నెల 22 వరకూ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.