AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..! ఇలా చేస్తే మార్పు పక్కా..

జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి పోషకాహారం ముఖ్యం. విటమిన్లు, ఒమెగా-3 అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. గోరువెచ్చని నూనెతో మసాజ్, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. హీట్ స్టైలింగ్ తగ్గించి, పెద్ద దంతాల దువ్వెన వాడండి. రెగ్యులర్ ట్రిమ్మింగ్, వదులైన హెయిర్ స్టైల్స్ మేలు. UV కిరణాల నుండి రక్షణ, తగినంత నిద్ర, నీరు, ఒత్తిడి తగ్గించడం జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..! ఇలా చేస్తే మార్పు పక్కా..
Healthy Hair Secrets
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2026 | 12:57 PM

Share

దాదాపుగా మనమందరం ప్రతిరోజూ జుట్టు రాలడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఇది శరీర పెరుగుదల, మరమ్మతు విధానంలో సహజ భాగం. కానీ, పెరుగుతున్న కాలుష్యం, హార్డ్ వాటర్ వాడకం, రోజువారీ స్టైలింగ్‌తో జుట్టు రాలడం పరిస్థితి అక్షరాలా మన చేతుల్లోనే ఉంది. మనం ఒత్తిడి, జన్యుశాస్త్రం, మన హార్మోన్లు దీనికి ప్రధాన కారణం. కానీ, అసలు కారణం మీ జుట్టు సంరక్షణ దినచర్య, జీవనశైలి. కానీ, ఎక్కువ మంది ప్రజలు సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులకు తిరిగి వస్తున్నందున, ఎటువంటి రసాయనాలను ఉపయోగించకుండా చక్కటి ఫలితాలను పొందుతున్నారు. బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్‌ చిట్కాలు ఇక్కడ చూద్దాం..

జుట్టు హెల్తీగా ఉండేందుకు ప్రతిరోజు పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్ A, విటమిన్ C, బయోటిన్, ఒమెగా-3, 6 ఎక్కువగా ఉండే ఆహారాన్ని తింటే కురులు ఒత్తుగా తయారవుతాయి. తలకు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జుట్టు ఎదుగుదలకి హెల్ప్ అవుతుంది. కురులు బలంగా, ఒత్తుగా మారుతాయి. తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు వాడండి. వేడి నీటితో తలస్నానం చేస్తే నేచురల్ ఆయిల్స్‌ని కోల్పోవాల్సి వస్తుంది. జుట్టు కూడా బ్రేక్ అవుతుంది.

హీట్ స్టైలింగ్ టూల్స్‌ని ఎక్కువగా వాడడం వల్ల కురులు బలహీనంగా మారి పల్చబడతాయి. అందుకే హెయిర్ బ్లో డ్రయర్స్‌, హెయిర్ స్ట్రేటెనర్ వంటి వాటిని తగ్గించండి. ఎప్పుడూ పెద్ద దంతాల ఉన్న దువ్వెనను మాత్రమే ఉపయోగించండి. దీంతో తల వెంట్రుకలు విరిగిపోకుండా ఉంటాయి. జుట్టు బలంగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

రెగ్యులర్‌గా జుట్టుని ట్రిమ్ చేస్తూ ఉండాలి. కనీసం 6 నుంచి 8 వారాలకు ఒకసారి ట్రిమ్ చేయటం వల్ల జుట్టు చివర్లు హెల్తీగా ఉంటాయి. వెంట్రుకలు పల్చబడటం తగ్గుతుంది. టైట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల జుట్టు రాలిపోవడం, బ్రేక్ అవడం వంటివి జరుగుతాయి. అందుకే వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్‌ వేసుకోండి.

యూవీ కిరణాలు, పొల్యూషన్, వాతావరణం నుంచి కూడా జుట్టును కాపాడుకోవాలి. దీనికోసం క్యాప్ లేదా స్కార్ఫ్ వంటి వాటితో తలను కవర్ చేసుకోండి. జుట్టు ఒత్తుగా, హెల్తీగా ఉండాలంటే రోజుకు 8 గంటలు నిద్రపోవడం మంచిది. అలాగే ఒత్తిడి తగ్గించుకోండి. సాధ్యమైనంత వరకు నీళ్లు ఎక్కువగా తాగండి. తద్వారా జుట్టు రాలడం, పల్చబడటం తగ్గుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..