AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti 2026: హనుమంతుడి శక్తి వెనుక అష్ట సిద్ధులు..! ఆ 8 రహస్యాలు మీకు తెలుసా?..

రామాయణంలో హనుమంతుడు చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. సముద్రాన్ని లంఘించడం, లంకను దహించడం, హిమాలయాల నుండి పర్వతాన్నే మోసుకొచ్చిన ఆయన శక్తికి సాటి ఎవరూ లేరు. అయితే, హనుమంతుడికి ఈ అపరిమితమైన బలం ఎక్కడి నుండి వచ్చింది? ప్రకృతి నియమాలను సైతం తన గుప్పిట్లో ఉంచుకునే ఆ 'అష్టసిద్ధులు' అంటే ఏమిటి? 2026 హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి శక్తి రహస్యాలను వెలికితీసే ప్రత్యేక కథనం ఇది.

Hanuman Jayanti 2026: హనుమంతుడి శక్తి వెనుక అష్ట సిద్ధులు..! ఆ 8 రహస్యాలు మీకు తెలుసా?..
Hanuman Jayanti 2026 Special
Bhavani
|

Updated on: Mar 27, 2026 | 5:49 PM

Share

“అష్టసిద్ధి నవ నిధి కే దాతా.. అసబర్ దీన్ జానకీ మాతా” – సీతామ్మ హనుమంతుడికి అష్టసిద్ధులను ప్రసాదించిందని హనుమాన్ చాలీసా చెబుతోంది. ఈ సిద్ధులు పొందిన వ్యక్తికి ప్రపంచంలో అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. మరి ఆ ఎనిమిది శక్తులు ఏవి? హనుమంతుడు వాటిని ఎక్కడెక్కడ ఉపయోగించాడు? సామాన్య భక్తులకు ఈ సిద్ధుల వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు సవివరంగా విశ్లేషిద్దాం..

ఆ ‘ఎనిమిది’ మహా శక్తుల వివరణ ఇది.. :

అణిమ: శరీరాన్ని పరమాణువు అంత సూక్ష్మ రూపంలోకి మార్చుకోవడం. సురస నోటిలోకి వెళ్లేటప్పుడు స్వామి ఈ శక్తిని వాడారు.

మహిమ: శరీరాన్ని పర్వతం అంత భారీ రూపంలోకి విస్తరించడం. సముద్రాన్ని దాటేటప్పుడు, లంకలో యుద్ధ సమయంలో దీనిని ఉపయోగించారు.

గరిమ: శరీరాన్ని ఊహించలేనంత బరువుగా మార్చుకోవడం. భీముడి గర్వాన్ని అణచేందుకు తోకను కదపలేనంత బరువుగా మార్చింది ఈ శక్తితోనే.

లఘిమ: శరీరాన్ని గాలి కంటే తేలికగా మార్చుకుని ఆకాశంలో ప్రయాణించడం.

ప్రాప్తి: ఎక్కడికైనా వెళ్లగలగడం, ఏ వస్తువునైనా పొందగలగడం. జంతువుల భాషను కూడా అర్థం చేసుకునే శక్తి దీనివల్ల వస్తుంది.

ప్రాకామ్యం: మనసులో అనుకున్నది వెంటనే జరిగేలా చేయడం. భూమి లోపలికి వెళ్లడం లేదా నీటిపై నడవటం దీనివల్ల సాధ్యం.

ఈశత్వం: ప్రకృతి శక్తులను, పంచభూతాలను తన నియంత్రణలో ఉంచుకోవడం. దైవ సమానమైన అధికారం.

వశిత్వం: ఎవరినైనా, దేనినైనా తన వశం చేసుకోవడం. ఇంద్రియాలను జయించడం.

భక్తులకు సందేశం:

ఈ సిద్ధులు కేవలం అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు.. క్రమశిక్షణ, బ్రహ్మచర్యం మరియు అంకితభావంతో ఉంటే మనిషి అసాధ్యాలను సుసాధ్యం చేయగలడనే దానికి హనుమంతుడు ఒక నిదర్శనం.

హనుమాన్ జయంతి రోజున ‘సుందరకాండ’ పఠించడం వల్ల మానసిక భయాలు తొలగి అష్టసిద్ధుల వంటి ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఎలాంటి సందేహాలున్న పండితులను జ్యోతిష్యనిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Follow Us
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
కామద ఏకాదశి.. ఈ వస్తువులు దానం చేశారంటే.. సంపద, ఐశ్వర్యం మీ వెంట
భక్తితో అగ్గిపెట్టెపై రామాయనాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
భక్తితో అగ్గిపెట్టెపై రామాయనాన్ని చిత్రీకరించిన కళాకారుడు!
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
ఆ దేశాన్ని మింగేస్తున్న సముద్రం.. 30 ఏళ్లలో మ్యాప్ నుంచే మాయం..
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అప్పుడే ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
కాశ్మీర్‌ కాదు మన అరకు.. పరవశించిపోయిన పర్యాటకులు.. ఇదిగో వీడియో
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
శ్రీదేవి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఆమె..
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
పెట్రోల్‌పై పన్ను ఎలా విధిస్తారు..? ఎన్ని రకాలుగా ఉంటుంది..?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
ప్రకృతినే శాసించ గల శక్తి .. హనుమంతుడికి ఇచ్చింది ఎవరో తెలుసా?
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..
ఆ ట్యాంకర్‌లలో నీరు సురక్షితం కాదు.. జలమండలి లోగో వాడితే జైలుకే..