ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఫీజు తగ్గింపు

ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి ఒప్పించింది గుజరాత్ ప్రభుత్వం.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఫీజు తగ్గింపు
Follow us

|

Updated on: Oct 01, 2020 | 6:26 AM

కరోనా మహమ్మారి పుణ్యామాని విద్యాసంవత్సరం రూపురేఖలే మారిపోయాయి. క్లాసు రూముల్లో విద్యార్థులు అడుగుపెట్టకుండానే విద్యా సంవత్సరం సాగిపోతుంది. అటు ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కనీసం విద్యార్థలకు ఫీజులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు 2020- 2021 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రాయితీకి ఒప్పించింది. గుజరాత్‌లోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్సు ఫీజుల్లో 25 శాతం తగ్గించడానికి అంగీకరించినట్లు ఆ రాష్ర్ట విద్యాశాఖమంత్రి భూపేంద్రసిన్హా తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు గానూ ఫీజుల రాయితీకి ఒప్పుకున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు పాఠశాలల యాజమాన్యాలతో విద్యాశాఖ పలుసార్లు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ తగ్గింపు సీబీఎస్‌ఈ పాఠశాలల్లోనూ వర్తింస్తుందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు 30 శాతం మేర ఫీజులు తగ్గించాలని ఒడిశా విద్యాశాఖ అక్కడి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరుపుతుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది. కరోనా కష్ట కాలం విద్యార్థలు తల్లిదండ్రుల బాధలు చూడలేక ప్రభుత్వాలే రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ఆర్థికంగా చితికిపోయినవారికి కొంతలో కొంతైనా ఊరట లభించనుంది.