నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్..

  • Updated On - 3:56 pm, Tue, 27 October 20
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

Good News To Un Employees: నిరుద్యోగులకు ఇదే సరైన అవకాశం. వివిధ బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 3,517 పీవో పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఐబీపీఎస్( ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ప్రకటించింది. ఈ పోస్టులకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

కెనరా బ్యాంక్(2,100), యూకో బ్యాంక్(350), బ్యాంక్ ఆఫ్ ఇండియా(734), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(250), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్(83)లలో పోస్టుల్ని నియమించనుంది. ఈ పోస్టులకు సంబంధించి ఐబీపీఎస్ పీవో ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 జనవరి 5,6వ తేదీల్లో జరగనుండగా.. గత ఆగష్టు 5 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

వివరాలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2020 అక్టోబర్ 28

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2020 నవంబర్ 11

ఐబీపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామ్: 2021 జనవరి 5 లేదా 6

విద్యార్హత: డిగ్రీ

వయస్సు: 20-30 ఏళ్లు

దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులు- రూ.850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.175

పూర్తి వివరాల కోసం :  https://www.ibps.in/