Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore district: వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం

అసలే వర్షాకాలం. గంగమ్మ తల్లి దయ వల్ల దండిగా కురుస్తున్నాయి వర్షాలు. ఎటు చూసినా.. వాగులూ వంకలూ నిండుగా పొంగుతున్నాయి.

Nellore district: వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం
Goddess Ganga
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 18, 2021 | 11:57 AM

అసలే వర్షాకాలం. గంగమ్మ తల్లి దయ వల్ల దండిగా కురుస్తున్నాయి వర్షాలు. ఎటు చూసినా.. వాగులూ వంకలూ నిండుగా పొంగుతున్నాయి. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ గంగమ్మ విగ్రహం.. వాగు మధ్యలో దర్శనమిచ్చింది. ఎంత ప్రవాహమైనా సరే.. కదలకుండా కూర్చుంది. నెల్లూరు జిల్లా- కొడవలూరు మండలం- గండవరం గ్రామంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత అక్కడుకు వెళ్లిన పిల్లలు నీట చిక్కిన ఈ విగ్రహాన్ని ఆశ్చర్యకరంగా చూడ్డం మొదలు పెట్టారు. దీంతో ఊరూ వాడా ఈ విషయం తెలిసిపోయింది. అందరూ వచ్చి చూశారు. కదలకుండా అక్కడే కూర్చున్నట్టు కనిపించే ఈ విగ్రహం గంగమ్మదనీ.. ఆ తల్లి చల్లని చూపు తమ ఊరి మీద పడింది కాబట్టే.. ఇలా నట్టనడి ప్రవాహంలో కదలకుండా కూర్చున్నదనీ అన్నారు. ఆమెకు దండాలు పెట్టి తిరిగి ఎవరిళ్లకు వారెళ్లిపోయారు.

ఇంతకీ ఈ విగ్రహం ఎందుకొచ్చిందీ అని వీరంతా ఆలోచించగా వారి మైండ్‌లోకి గ్రామ దేవాలయం వచ్చింది. వారి గ్రామంలోనే ప్రసిద్ధ ఉదయకాలేశ్వర స్వామి ఆలయముంది. ఇక్కడి శివుడ్ని వెతుక్కుంటూ ఆ గంగమ్మ తల్లే కదలి వచ్చిందని నమ్ముతున్నారు గ్రామస్తులు. ఇంత ప్రవాహంలోనూ తల్లి విగ్రహం కదల్లేదంటే.. ఇదంతా ఆమెకు మన ఊరిపై ఉన్న కరుణా కటాక్షాలే కారణమంటున్నారు గ్రామస్తులు.

Also Read: కవలల హత్యకేసులో మిస్టరీ వీడింది.. హత్య చేసింది ఎవరంటే…?

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. గత 24 గంటల్లో 518 మంది మృత్యువాత..

ఆ బాధే నా బలం అయ్యింది: GT బౌలర్ బోల్డ్ కామెంట్స్
ఆ బాధే నా బలం అయ్యింది: GT బౌలర్ బోల్డ్ కామెంట్స్
ప్రధాని మోదీ దౌత్యం.. 14 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక
ప్రధాని మోదీ దౌత్యం.. 14 మంది మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక
బాబాయ్.. హీరోయిన్లకు సైతం గుబులు పుట్టించేస్తోన్న రవితేజ కూతురు..
బాబాయ్.. హీరోయిన్లకు సైతం గుబులు పుట్టించేస్తోన్న రవితేజ కూతురు..
సెకండ్‌ హ్యాండ్‌ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?
సెకండ్‌ హ్యాండ్‌ ఏసీ కొనడం వల్ల నష్టాలు ఏమిటి?
అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
అయ్యో పాపం..పెంపుడు కుక్క కోసం మొసలితో ఫైట్‌ చేసిన యువతి.. చివరకు
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
వరుడి షూ దాచి డబ్బు డిమాండ్‌! 5 వేలే ఇచ్చాడని..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
ప్రభాస్ బౌలింగ్‏కు రామ్ చరణ్ బ్యాటింగ్.. ఎన్టీఆర్ క్యాచ్..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
బట్టతలపై జుట్టు మొలిపిస్తామని మందురాసిండు.. చివరకు..
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
దర్శకులు అనాలా.. యాక్టర్స్ అనాలా.. యంగ్ కెప్టెన్స్ సూపర్ టాలెంట్‌
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్
భాయ్ హ్యాండిల్ విత్ కేర్! పోలార్డ్ కి MI ఫ్యాన్ స్వీట్ వార్నింగ్