కరోనా కట్టడికి.. గోవా సర్కార్ కొత్త యాప్.. ‘కోవిద్-లొకేటర్’
కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గోవా ప్రభుత్వం 'కోవిడ్-లొకేటర్' యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జీపీఎస్ ఆధారిత లొకేషన్ ట్రాకర్‌గా

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. గోవా ప్రభుత్వం ‘కోవిడ్-లొకేటర్’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. జీపీఎస్ ఆధారిత లొకేషన్ ట్రాకర్‌గా ఇది ఉపయోగపడుతుంది. దీని ద్వారా హోం క్వారంటైన్‌లో ఉన్న వారి జాడ, కదలికలను తెలుసుకోవచ్చు. కోవిడ్-19 మరింత విస్తరించకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకువచ్చింది.
కాగా.. కరోనావైరస్ భారత్ లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. హోం క్వారంటెన్ పేషంట్ల జాడ గుర్తించడం ద్వారా ఇతరులకు వ్యాధి విస్తరించకుండా కాపాడేందుకు వీలుటుందని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇంటుజిన్ కొలాబొరేషన్‌తో ఈ యాప్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆండ్రాయిట్ ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. కాగా, గోవాలో ఇంతవరకూ 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.