తలకు పచ్చబొట్లు కాదు.. రోకలి చుడితే బెటర్‌!

వెర్రి వెయితలలు వేయడమంటే ఇదే కాబోలు.. పచ్చబొట్టు మీద పిచ్చి ఉండొచ్చు కానీ.. అది పరాకాష్టకు చేరితే మాత్రం సాండ్రోలా తయారవుతారు.. .. శరీరాన్ని టాటూలతో నింపిపారేశాడు.. ఇందుకోసం సుమారు ఓ ఆరు లక్షల రూపాయలు తగలేశాడు.. ఇంతేసి డబ్బు పోసినందుకు బాడీ అందంగా తయారయ్యిందా అంటే అదీ లేదు.. పచ్చబొట్లతో పిచ్చి పిచ్చిగా తయారయ్యింది.. టాటూల కోసమని చేతిపై కొంత చర్మాన్ని కూడా తీసేయించుకున్నాడీ పిచ్చి బొట్ల ప్రేమికుడు.

తలకు పచ్చబొట్లు కాదు.. రోకలి చుడితే బెటర్‌!
Follow us
Balu

|

Updated on: Aug 28, 2020 | 11:51 AM

వెర్రి వెయితలలు వేయడమంటే ఇదే కాబోలు.. పచ్చబొట్టు మీద పిచ్చి ఉండొచ్చు కానీ.. అది పరాకాష్టకు చేరితే మాత్రం సాండ్రోలా తయారవుతారు.. అంతగా ఆయనేం చేశాడన్న మీ అనుమానం ఫోటో చూస్తే తీరిపోతుంది.. జర్మనీకి చెందిన ఆ టాటూ ప్రేమికుడికి పచ్చబొట్టేసుకోవడమంటే మహా సరదా! ఎంత సరదా అంటే వంటి నిండా పొడిపించుకునేంత సరదా! పైపెచ్చు ఆయనో కళాకారుడు కాబట్టి ఇంకా రెచ్చిపోయాడు.. శరీరాన్ని టాటూలతో నింపిపారేశాడు.. ఇందుకోసం సుమారు ఓ ఆరు లక్షల రూపాయలు తగలేశాడు.. ఇంతేసి డబ్బు పోసినందుకు బాడీ అందంగా తయారయ్యిందా అంటే అదీ లేదు.. పచ్చబొట్లతో పిచ్చి పిచ్చిగా తయారయ్యింది.. టాటూల కోసమని చేతిపై కొంత చర్మాన్ని కూడా తీసేయించుకున్నాడీ పిచ్చి బొట్ల ప్రేమికుడు.. సారీ పచ్చబొట్ల ప్రేమికుడు.. అతడి శరీరం.. అతడిష్టం .. కాదనడానికి మనమెవరం కానీ.. అంతటితో ఆగిపోతే బాగుండేది.

నోట్లో నాలుకను కూడా రెండుగా చీల్చేసుకున్నాడు.. మొత్తంగా 17 సార్లు శరీరాన్ని వివిధ రకాలుగా మార్పులు చేర్పులు చేసుకున్నాడు.. అంతేనా.. చివరాఖరికి చెవులు కూడా కత్తిరించుకున్నాడు.. సంగీతం కోసం కాదు.. టాటూల కోసమే.. కోసుకున్న చెవులను ఓ జాడీలో పాడవకుండా భద్రంగా పెట్టుకున్నాడు.. చేస్తే చేశాడు కానీ ఇవన్నీ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.. ఒళ్లంతా టాటూలతో ఉండిన ఆ వీడియో చూసిన వారికి ఒళ్లు గగుర్పొడవకుండా ఎలా ఉంటుంది చెప్పంది.. మతి భ్రమించిందని కొందరు.. పైత్యం ప్రకోపించిందని ఇంకొందరు… మిస్టర్‌ స్కల్‌ ఫేస్‌ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.. ఎవరెన్ని మాటలంటున్నా సాండ్రో మాత్రం డోంట్‌ కేర్‌ అంటున్నాడు.. తనను చూసి భయపడేవారిని ఎందుకు పట్టించుకోవాలంటున్నాడు. తనను తిట్టిపోస్తున్నా సరే .. అవే పొగడ్తలుగా భావిస్తానని చెప్పుకొస్తున్నాడు. విమర్శలు తన ఆత్మస్థయిర్యాన్ని రెట్టింపు చేస్తాయని లెక్చర్లిస్తున్నాడు. చెవులను కత్తిరించుకున్న సాండ్రో ఇప్పుడు ముక్కు పై భాగాన్ని కట్‌ చేసుకునే పనిలో ఉన్నాడు.. ఉద్యోగం సద్యోగం… ఏ బాదరా బందీ లేని సాండ్రో ఇంతకు మించి ఏం చేస్తాడు చెప్పండి..!