139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’

పంజాగుట్టలో 139 మంది అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును సీసీఎస్‌కి బదిలీ చేశారు. కేసు డైరీని సీసీఎస్ పోలీసులకు అందజేశారు పంజాగుట్ట పోలీసులు. 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో..

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన 'డాల‌ర్ బాయ్'
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 28, 2020 | 11:45 AM

పంజాగుట్టలో 139 మంది అత్యాచారం కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసును సీసీఎస్‌కి బదిలీ చేశారు. కేసు డైరీని సీసీఎస్ పోలీసులకు అందజేశారు పంజాగుట్ట పోలీసులు. 139 మందిపై ఆరోపణల్లో ఎవరు నిందితులు, ఎవరు భాదితులు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. యాంకర్ ప్రదీప్‌పై సంచలన ఆరోపణలు చేస్తోంది బాధితురాలు. 139 మందిలో కొంత మంది మాత్రమే ఆధారాలు పోలీసులకు అందజేసినట్లు సమాచారం. బాధితురాలి పేరుతో డాలర్ బాయ్ అనే వ్యక్తి బ్లాక్ మెయిల్‌కి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ‌స్తున్నాయి.

దీంతో ఈ కేసులో డాల‌ర్ బాయ్ కీల‌కంగా మారాడు. డాల‌ర్ బాయ్ వ్య‌వ‌హ‌రాంపై సీసీఎస్ పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే భాదితురాలు స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. తమ ప్రమేయం లేకపోయిన ఉద్దేశ పూర్వకంగా ఇరికించారని పలువురు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కాగా డాలర్ బాయ్ చేర నుండి బాధితురాలిని తప్పించి, ప్రభుత్వ హోంకి త‌ర‌లించ‌నున్నారు పోలీసులు. ఈ కేసుపై ఇంకా విచార‌ణ కొన‌సాగుతోంది.

కాగా ఈనెల 21వ తేదీన 139 మంది అత్యాచారం చేశారంటూ మిర్యాలగూడకు చెందిన 25 ఏళ్ల యువతి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మొత్తం 139 మందిపై పంజాగుట్ట పోలీసులు నిర్భయ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే ఓ మహిళ ఇంత మందిపై ఫిర్యాదు చేయడం, 139 మందిపై నిర్భయ కేసు నమోదు కావడం దేశ చరిత్రలోనే ఇదే మొదటికి కావడం విశేషం.

Read More:

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు