కాలేజీ మెరిట్‌ జాబితాలో సన్నీ లియోన్‌ టాప్‌

కోల్‌కతాలోని ఓ కాలేజీ ప్రకటించిన మెరిట్ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ టాప్‌లో నిలిచారు

కాలేజీ మెరిట్‌ జాబితాలో సన్నీ లియోన్‌ టాప్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 28, 2020 | 11:56 AM

Sunny Leone Merit List: కోల్‌కతాలోని ఓ కాలేజీ ప్రకటించిన మెరిట్ జాబితాలో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ టాప్‌లో నిలిచారు. అదేంటి సన్నీ లియోన్ మళ్లీ కాలేజీకి వెళ్లనుందా..? డిగ్రీ చదివేందుకు ఆమె కాలేజీకి దరఖాస్తు చేసుకుందా..? అని ఆశ్చర్యపోతున్నారా.! అయితే అసలు విషయంలో ఏంటంటే..

అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం కోల్‌కతాలోని అషుతోష్ కాలేజీ మెరిట్ లిస్ట్‌ని విడుదల చేసింది. ఆ లిస్ట్‌లో సన్నీ లియోన్‌ టాప్‌గా నిలిచారు. ఆమె పేరుతో పాటు అప్లికేషన్ ఐడీ(9513008704), రోల్‌ నంబర్(207777-6666)‌లు కూడా ఉన్నాయి. అంతేకాదు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో బెస్ట్ ఫోర్ సబ్జెక్ట్‌లలో సన్నీకి 400 మార్కులు వచ్చాయి. దీంతో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు షాక్‌కి గురయ్యారు. ఇక దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఎవరో ఆకతాయి ఈ పని చేశారని, తప్పుడు దరఖాస్తును సమర్పించారని యాజమాన్యం తెలిపింది. దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.

ఆ తరువాత సాయంత్రానికి ఆ పేరును ఏబీసీగా మార్చిన యాజమాన్యం మిగిలిన వివరాలను అలానే ఉంచింది. మరోవైపు ఘటనతో ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశంలో కరోనా నేపథ్యంలో సన్నీ లియోన్ తన కుటుంబంతో కలిసి ఆ మధ్యన లాస్ ఏంజిల్స్‌కి వెళ్లారు. అక్కడ సన్నీ భర్త డేనియల్‌ వెబర్‌ తల్లితో పాటు సన్నీ కుటుంబం నివసిస్తోంది.

Read More:

అవును మా తమ్ముడిపై మాకు ప్రేమ లేదు: సుశాంత్ సోదరి కీలక పోస్ట్‌

గణేషుడి నిమజ్జనంలో కాల్పుల కలకలం