Mosquitos: ఇక రండి చూసుకుందాం.. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఇంట్లోకి అడుగుపెట్టలేదు..

సాయంత్రమైతే చాలు దోమలు ఇంట్లోకి ఎగబడతాయి. పొద్దు కూకగానే కుట్టుడు షురూ చేస్తాయి. ఎంత తలుపులు వేసినా ఓ పట్టాన వదలవు. కుట్టి చిరాకు తెప్పిస్తుంటాయి. ఇవి కుట్టడం వల్ల చాలా వ్యాధులు కూడా వస్తాయి. అయితే రూపాయి ఖర్చు లేకుండా దోమలకు ఇలా చెక్ పెట్టండి...

Mosquitos: ఇక రండి చూసుకుందాం.. ఇలా చేస్తే ఒక్క దోమ కూడా ఇంట్లోకి అడుగుపెట్టలేదు..
Mosquitos
Follow us
P Shivteja

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 24, 2024 | 11:00 AM

దోమకాటు చాలా డేంజర్. దోమలు ఎన్నో వ్యాధులకు కారకాలు.  కాబట్టి.. వీటిని ఇంట్లోకి రాకుండా చేయాలి..అయితే చాలా మంది దోమలు రాకుండా ఉంటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫెయిల్ అవుతూ ఉంటారు. చలికాలంలో ఇంట్లోకి దోమలు విపరీతంగా వస్తుంటాయి.. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లోకి దోమలు రాకుండా నివారించవచ్చు. వర్షాకాలంలోనే కాదు చలికాలంలో కూడా ఇంట్లోకి దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల మనం ఎన్నో జబ్బుల బారిన పడాల్సి వస్తుంది..ముఖ్యంగా దోమలు రాత్రిపూట మనం నిద్రపోకుండా కుడుతూనే ఉంటాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే దోమలు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. వెల్లుల్లితో  ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో ఉంటుంది. ఎందుకంటే దీనిని మనం రెగ్యులర్‌గా వంటల్లో ఉపయోగిస్తాం..ఇది మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది..ఇది అందరికీ తెలిసిందే…కానీ ఈ వెల్లుల్లితో కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేయొచ్చన్న ముచ్చట ఎవ్వరికీ తెలియదు. అవును వెల్లుల్లి వాసన దోమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దీని వాసనకు ఇంట్లో ఒక్క దోమ లేకుండా పారిపోతాయి..ఇంట్లో దోమలు లేకుండా చేయడానికి వెల్లుల్లిని బాగా దంచండి. దీన్ని గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించండి..ఈ నీళ్లను బాగా చల్లార్చి స్ప్రే బాటిల్ లో నింపండి. దీన్ని సాయంత్రం లేదా రాత్రిపూట ఇంట్లో స్ప్రే చేయండి. దీనివల్ల ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. ఉన్న దోమలు కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి.

దోమలను తరిమికొట్టడానికి ఇతర మార్గాలు:

కర్పూరంతో కూడా ఇంట్లో దోమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం కర్పూరాన్ని వెలిగించండి. దీనివల్ల ఇంట్లో దోమలు లేకుండా వెంటనే పారిపోతాయి..ప్రతిరోజూ ఇంట్లో సాయంత్రం పూట వేప ఆకులను కాల్చితే కూడా దీని వాసనకు ఇంట్లోకి దోమలు రావు..దోమలు కుట్టకుండా ఉండాలంటే కాళ్లు చేతులకు ఆవ నూనె రాయండి..అలాగే తులసి వాసనకు కూడా ఇంట్లోకి దోమలు రావు. కాబట్టి తులసి వాటర్‌ను స్ప్రే చేయండి. ఇంట్లో దోమలను తరిమికొట్టడానికి నిమ్మకాయ, లవంగాలు చాలా ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఇందు కోసం నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి దానిపై లవంగాలను గుచ్చండి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..