Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్ చేస్తే.. రికార్డు స్పష్టించిన స్టార్ ఆల్‌రౌండర్..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టీ20ల్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత్ ప్లేయర్‌గా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో హర్ధిక్ పాండ్య ఈ ఘనతను సాధించాడు.

Hardik Pandya: 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్ చేస్తే.. రికార్డు స్పష్టించిన స్టార్ ఆల్‌రౌండర్..
Hardik Pandya
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 24, 2024 | 10:49 AM

ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బరోడాతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. గుజరాత్ తరుపున ఓపెనర్ ఆర్య దేశాయ్ 52 బంతుల్లో 3 సిక్సర్లు, 9 ఫోర్లతో 78 పరుగులు చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఛేదించిన బరోడా జట్టుకు శుభారంభం లభించలేదు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టుకు మిడిలార్డర్‌లో హార్దిక్ పాండ్యా అండగా నిలిచాడు. దూకుడుతో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ గెలుపులో భాగమయ్యాడు. ఐదో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో అజేయంగా 74 పరుగులు చేశాడు. దీంతో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాండ్య ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో 5067 పరుగులు, 180 వికెట్లు సాధించాడు.  రవీంద్ర జడేజా 3684 పరుగులు, 225 వికెట్లతో తర్వాత వరుసలో ఉన్నాడు. అక్షర్ పటేల్ (2960 పరుగులు, 227 వికెట్లు), హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా (2712 పరుగులు, 138 వికెట్లు) తర్వాత వరుసలో  ఉన్నారు.

185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరోడా జట్టు హార్దిక్ పాండ్యాపైనే ఆధారపడింది. బరోడా ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయింది, కానీ తర్వాత పాండ్యా, శివాలిక్ శర్మ (43 బంతుల్లో 64)లు ఇద్దరు కలిసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడారు. పాండ్యా ఐదవ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఒకానొక సమయంలో, బరోడాకు ఐదు ఓవర్లలో 63 పరుగులు అవసరం ఉండగా, పాండ్యా బ్యాటింగ్ వచ్చి అర్ధశతకం కేవలం 28 బంతుల్లో చేసి టీమ్‌ను కష్టాలోంచి బయటకు నెట్టేశాడు. పాండ్య ఇటీవల ICC T20I ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని తిరిగి పొందాడు.

బరోడా ప్లేయింగ్ 11: మితేష్ పటేల్ (వికెట్ కీపర్), భాను పానియా, విష్ణు సోలంకి, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా (కెప్టెన్), నినాద్ అశ్విన్‌కుమార్ రథ్వా, శివాలిక్ శర్మ, మహేష్ పిథియా, రాజ్ లింబాని, లుక్మాన్ మేరీవాలా, అహిత్ షేత్.

గుజరాత్ ప్లేయింగ్ 11: ఆర్య దేశాయ్, ఉర్విల్ పటేల్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, ఉమంగ్ కుమార్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్ (కెప్టెన్), హేమంగ్ పటేల్, చింతన్ గజా, రవి బిష్ణోయ్, అర్జన్ నగవస్వాల్లా, తేజస్ పటేల్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి