భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలు తింటున్నారా..?

Jyothi Gadda

24 November 2024

TV9 Telugu

పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 

TV9 Telugu

భోజనంతో పాటు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఇందులో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. 

TV9 Telugu

ఉల్లిపాయలు గట్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.. పచ్చి ఉల్లిపాయల్లో ఉండే పోషకాలు మన గట్ లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

TV9 Telugu

ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయలు బాగా ఉపయోగపతాయి. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

TV9 Telugu

ఉల్లిపాయలోని పోషకాలు ఎన్నో రోగాల నుంచి కాపాడుతాయి. ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. దగ్గు, జలుబు వంటి చిన్న సమస్యలతో ఎన్నో పెద్ద సమస్యలను దూరం చేస్తుంది. 

TV9 Telugu

బరువు తగ్గాలనుకునేవారికి కూడా పచ్చి ఉల్లిపాయలు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

TV9 Telugu

పచ్చి ఉల్లిపాయల్ని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో హెవీగా తినకుండా, ఇతర చెడు ఆహారాల జోలికి వెళ్లకుండా ఉంటారు. దీంతో ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతారు. 

TV9 Telugu

చర్మ సమస్యలను తగ్గించడానికి పచ్చి ఉల్లిపాయలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందులోని సల్ఫర్ సమ్మేళనం ముఖంపై మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని సాఫ్ట్ గా, ఆరోగ్యంగా చేస్తుంది.

TV9 Telugu