- Telugu News Photo Gallery Cinema photos Prabhas and samantha Most Popular Hero Herione List what about others
మోస్ట్ పాపులర్ లిస్టులో ప్రభాస్, సమంత.. మిగిలిన వారి సంగతేంటి ??
అవతల మీరు ఎంత మందైనా ఉండండి... ఫస్ట్ ప్లేసులు కొట్టేయడానికి మేం సిద్ధంగానే ఉన్నాం... అంటున్నారు టాలీవుడ్ సెలబ్రిటీలు. అదర్ ఉడ్స్ ఐకమత్యంగా దండయాత్ర చేసినా... నెవర్ గివప్ యాటిట్యూడ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ సారి లీడ్ తీసుకున్నారు ప్రభాస్ అండ్ సమంత...
Updated on: Nov 24, 2024 | 10:40 AM

సలార్ సెట్‌రైట్ చేస్తే కల్కి సినిమాతో కలెక్షన్లు కొల్లగొట్టేశారు ప్రభాస్. ఈ ఏడాది నేషనల్ లెవల్లో మారుమోగిపోయింది డార్లింగ్ పేరు. ఇప్పుడు కూడా మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్.

షారుఖ్, విజయ్‌లాంటి వాళ్లను పక్కకు జరిపి ఆర్మాక్స్ అక్టోబర్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు డార్లింగ్. జస్ట్ ఇప్పుడు మాత్రమే కాదు... నెక్స్ట్ కూడా ఏదో ఒక అప్‌డేట్‌తో వార్తల్లో ఉంటారు ప్రభాస్.

మరి ఈ వార్తలతో నెక్స్ట్ టైమ్ కూడా ఆయనే లీడ్‌లో ఉంటారా? లేకుంటే అల్లు అర్జున్‌కి సైడ్ ఇస్తారా? అనే చర్చ కూడా ఊపందుకుంది. మరోవైపు ఫీమేల్ కేటగిరీలో సమంత లీడ్ తీసుకున్నారు.

ఆలియాభట్, దీపిక, నయన్, శ్రద్ధా కపూర్, సాయిపల్లవి... వీరందరూ సమంత తర్వాతే అంటోంది లేటెస్ట్ జాబితా. మోస్ట్ పాపులర్ హీరోయిన్‌గా ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు సామ్.

ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తెలియక చాలా మంది తెగ కష్టపడుతుంటారు. కానీ తను అలా కాదంటున్నారు సమంత.




