ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుండి అంటే.?

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుండి అంటే.?

Anil kumar poka

|

Updated on: Nov 23, 2024 | 5:03 PM

ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అతి త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. కొత్త పెన్షన్ల మంజూరు చేయటంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తోంది.

తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ పై ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్ లైన్ విధానంతో పాటుగా వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని నిర్ణయించింది. దాదాపు రెండు లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో కొత్తగా పెన్షన్ల మంజూరు విషయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని సూచించారు. జన్మభూమి -2 జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోనే కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. వృద్ధాప్య, వితంతు పింఛన్ తో పాటుగా అన్ని రకాల పెన్షన్లలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తు దారులు తమ అప్లికేషన్లతో పాటు.. ఆధార్, రేషన్ కార్డ్‌, బ్యాంకు ఖాతా వివరాలు తప్పని సరిగా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నెంబర్ ను ఇవ్వాలి. వితంతు పెన్షన్ల కు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు. వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసేలా నిర్ణయించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.