Viral Video: వాటే థాట్, వాటే విజన్.. ఏఐని ఎలా వాడారో చూడండి..
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది. ప్రతీ రంగంలో ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీ సృష్టిస్తోన్న అద్భుతాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి..
ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ జరుగుతోంది. రాబోయేతరం మొత్త ఏఐదే అనే వాదనలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీలో వస్తున్న మార్పులతో ప్రపంచం మొత్తం మారనుందన్న వార్తలు వస్తున్నాయి. దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలు ప్రమాదంలో పడుతాయన్న చర్చ ఓవైపు, కొత్త ఉద్యోగాలు వస్తాయన్న చర్చ మరో వైపు నడుస్తోంది.
ఇక ఏఐ చాట్‌బాట్‌లను విద్యార్థులు హోం వర్క్ కోసం కూడా ఉపయోగిస్తున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ విద్యార్థిని ఏఐని ఉపయోగించిన విధానాన్ని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఓ విద్యార్థి ఏఐ టెక్నాలజీ సహాయంతో హోం వర్క్ చేశాడు.
అచ్చంగా తన హ్యాండ్ రైటింగ్‌ను పోలిన విధంగా రాసే మెషిన్‌ను రూపొందించాడు. ఈ మిషిన్ అచ్చంగా మనిషి చేత్తో రాస్తున్నట్లే రాసేస్తోంది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాడు. ఒక పేజీలో రాయడం పూర్తి కాగానే మరో పేజీని కూడా మిషిన్ ఓపెన్ చేస్తుండడం మరో విశేషం. ఈ మిషిన్ హోం వర్క్ రాస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
View this post on Instagram
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఏఐ టెక్నాలజీతో ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతాయో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హోమ్ వర్క్ చేస్తున్న ఈ ఏఐ మిషిన్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘వాటే విజన్, వాటే థాట్’ అంటూ మీమ్స్‌ను డిజైన్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..