23 November 2024
Pic credit - Getty
TV9 Telugu
మధుమేహం అనేది ఒక ఆరోగ్య సమస్య. ఎవరికైనా అది వస్తే.. ఈ వ్యాధి బారిన పడిన వారు శాశ్వతంగా షుగర్ పేషెంట్స్ గా జీవించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా నయం కాదు.
ఆరోగ్యంగా ఉండటానికి షుగర్ పేషెంట్స్ మార్నింగ్ వాక్, సరైన నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లను కొనసాగించాలి.
చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో తక్కువ గ్లైసెమిక్ అంటే తక్కువ చక్కెర ఉన్న ఆహారం రక్తంలో షుగర్ లెవెల్ ను నియంత్రించడంలో సహాయపడతాయి.
రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి మఖానాను తినవచ్చు. ఎందుకంటే ఇది పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఆహారం.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఉదయం ఒకటి లేదా రెండు గుప్పెళ్ళు మఖానా తినవచ్చు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
మఖానా తినడం వల్ల కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్, థయామిన్, ఫాస్పరస్, పొటాషియం సహా అనేక ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.
అయితే రోజూ మఖానా తినే వారు.. పుష్కలంగా నీరు త్రాగాలని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఉదయం ఒక గ్లాసు నీటితో రోజుని ప్రారంభించండి.