చెప్పులు లేకుండా నడవడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. బాడీ రిలాక్స్ అయ్యి మంచి నిద్ర లభించేలా చేస్తుంది.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా చెప్పులు లేకుండా నడవడం సహాయపడుతుంది. ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఉత్తి కాళ్లతో నడిస్తే.. కాళ్ల కండరాలు బలంగా మారుతాయి. దీంతో కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఉత్తి చెప్పులతో నడవడం సహాయపడుతుంది. పాదాల్లో రక్తప్రసరణ జరిగేలా ఉపయోగపడుతుంది.
చెప్పులు లేకుండా నడవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తప్రసరణ పెరగడం వల్లే ఇది సాధ్యమవుతుందని అంటున్నారు.
అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంలో కూడా ఉత్తి కాళ్లతో నడవడం ఉపయోగపడుతుంది. ఇలా నడిస్తే అటానమిక్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేసే పారాసింపథెటిక్ చర్యను పెంచడం ద్వారా అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.