వామ్మో.. చపాతీలు తింటున్నారా..? ఈ సమస్యలుంటే డేంజరే
23 November 2024
Shaik Madar Saheb
జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. అందుకే తినే ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది..
గోధుమ పిండితో చేసిన చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ.. కొందరికి మాత్రం అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొంతమందికి టిఫిన్, డిన్నర్‌కి లేదా లంచ్‌కి చపాతీ తినే అలవాటు ఉంటుంది. అయితే.. కొన్ని సమస్యల్లో చపాతీ తినకూడదని నిపుణులు బెబుతున్నారు.
డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు గోధుమ చపాతీ తింటారు. ఇందులో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి.
డయాబెటిస్ రోగులు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలసిపోయినా, నీరసంగా ఉన్నా చపాతీ తినకండి. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి.
మీకు ఏదైనా థైరాయిడ్ సమస్య ఉంటే చపాతీ తినకండి. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక బరువులో చాలామంది అన్నం మానేసి చపాతీ తింటారు. చపాతీలు ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు.. కాబట్టి వీలైనంత వరకు చపాతీకి దూరంగా ఉండటం మంచిది.
చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుంది. పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు దూరంగా ఉండటం మంచిది.