Politics: జైలుకి వెళ్తే జయం మనదేరా !.. సోరెన్‌ గెలుపుతో బిగ్‌ సౌండ్‌

దేశ రాజకీయాల్లో ఏ పార్టీ అధినేత అయినా జైలుకి వెళ్తే సీఎం అవుతారా...? జైలు జీవితం గడిపితే బిగ్‌ విక్టరీ పక్కానా...? అంటే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్స్‌ ప్రకారం ఎవ్వరైనా యస్‌ అనాల్సిందే. పాదయాత్రలు చేస్తే పక్కా గెలుపు అనేవాళ్లు ఒకప్పుడు. జైలుకెళ్లిన వారిదే విజయం అంటున్నారిప్పుడు. జైలు సెంటిమెంట్‌ ఇచ్చే జడ్జిమెంట్‌ అంత సాలిడ్‌గా ఉంటోంది మరి. లేటెస్ట్‌గా జార్ఖండ్‌లో గెలిచిన హేమంత్‌ సోరెన్‌ నుంచి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైనవారి వరకు ఈ సెంటిమెంట్‌ పక్కాగా వర్కౌట్‌ అయ్యింది.

Politics: జైలుకి వెళ్తే జయం మనదేరా !.. సోరెన్‌ గెలుపుతో బిగ్‌ సౌండ్‌
Political Leaders
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 24, 2024 | 10:17 AM

జైలుకి వెళ్తే జయం మనదేరా !… జైలు జీవితం… తిరుగులేని విజయం.. జైలు సెంటిమెంట్‌… విక్టరీ జడ్జిమెంట్.. హేమంత్‌ సోరెన్‌ విజయంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కొటేషన్స్‌ వినిపిస్తున్నారు. గెలుపు కోసం ఎన్ని వ్యూహాలు రచించినా… ఎన్ని హామీలు ప్రకటించినా…చమటోడ్చి పాదయాత్రచేసినా… జైలు సెంటిమెంట్‌ ముందు అన్నీ జూజూబీనే అన్నట్లుంది పరిస్థితి. లేటెస్ట్‌గా జార్ఖండ్‌ డైనమైట్ హేమంత్‌ సోరెన్‌ గెలుపుతో ఆ జైలు సెంటిమెంట్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. జైలు జీవితం ఇచ్చిన గ్రాండ్‌ విక్టరీ… ఇప్పుడు దేశవ్యాప్తంగా బిగ్‌ సౌండ్‌ చేస్తోంది.

సోరెన్‌ది మామూలు విజయం కాదు… జార్ఖండ్‌లో 24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన మరుపురాని విజయం. సరికొత్త చరిత్రను లిఖించిన విజయం. వరుసగా రెండోసారి ఏ పార్టీ అక్కడ గెలవదన్న సెంటిమెంట్‌ను ఓటర్లు సింపుల్‌గా పక్కన పెట్టేశారు. జైలు జీవితం గడిపిన సోరెన్‌కే మళ్లీ పట్టం కట్టారు. జైలుకి వెళ్లిన నేతలకు మంచే జరుగుతుందని మరోసారి రుజువుచేశారు జార్ఖండ్‌వాసులు.

సోరెన్‌ కంటే ముందు జైలుకెళ్లి విజయాలు సాధించినవారు చాలామందే ఉన్నారు. చరిత్ర చూస్తే… జైలుకెళ్తేనే విజయం అన్నట్లుగానూ ఉంది పరిస్థితి. అంతెందుకు ఆరు నెలల క్రితం సీఎం అయిన చంద్రబాబు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… అదీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే జైలుకి వెళ్లారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే… దాదాపు రెండు నెలలుగా జైలు జీవితం గడిపిన చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అద్దిరిపోయే విజయాన్నందుకున్నారు. పార్టీ చరిత్రలో ఎన్నడూ చూడని విజయాన్ని ఏపీ జనాలు చంద్రబాబుకు కట్టబెట్టారు.

ఇక అంతకుముందు జగన్‌ కూడా జైలుకి వెళ్లొచ్చాకే సీఎం అయ్యారు. ఆస్తుల కేసులో దాదాపు 16 నెలలుపాటు జైలు జీవితం గడిపిన జగన్‌… దాన్నే ఆయుధంగా చేసుకుని జనాల్లోకి చురుగ్గా వెళ్లారు. ఇంకేముంది… బంపర్‌ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. పార్టీ ఎన్నడూ చూడని మరుపురాని విజయం దక్కింది.

తెలంగాణ విషయానికొస్తే… ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌ రెడ్డి కూడా జైలుకెళ్లినవారే. ఓటుకి నోటు కేసులో అరెస్టై జైలు జీవితం గడిపిన రేవంత్‌… అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌ టార్గెట్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరి… గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి సీఎం అయ్యారు రేవంత్‌ రెడ్డి. మొత్తంగా.. హిస్టరీ చూస్తే జైలు జీవితం నేతల మంచికే అన్నట్లుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..