పసిఫిక్ మహాసముద్రం ఎంత లోతు ఉంటుందంటే.? 

TV9 Telugu

25 December 2024

ప్రపంచంలోని అతిపెద్ద, లోతైన సముద్రంగా పసిఫిక్ మహాసముద్రంగా భావిస్తారు. దాని లోతు ఎంతో ఉంటుందో తెలుసా..?

ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వరకు విస్తరించి ఉన్న పసిఫిక్ మహాసముంద్రం మొత్తం వైశాల్యం 1,65,2,00,000 చదరపు కిలోమీటర్లు.

ప్రపంచంలో ఉన్న ఐదు మహాసముద్రాలలో పసిఫిక్ మహాసముద్రం కూడా లోతైన సముద్రం. పసిఫిక్ మహాసముద్రం లోతు 14,020 అడుగులు. అంటే 4,820 మీటర్లు.

ఒక వ్యక్తి పసిఫిక్ మహాసముంద్రం లోతుకు వెళ్లాలంటే నాలుగైదు కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతుకు దిగాల్సి వస్తుంది.

పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ అనే ప్రాంతం ప్రపంచంలో లోతైన ప్రాంతంగా భావిస్తారు శాస్త్రవేత్తలు

మరియానా ట్రెంచ్ లోతు అక్షరాలా 35,797 అడుగులు. అంటే 11,000 మీటర్లు. ఇది11 కిలోమీటర్ల లోతు ఉంది అన్నమాట.

ఇది ఆసియా, ఆస్ట్రేలియాలతో పాటు అమెరికా ఖండాలను వేరు చేస్తుంది. ప్రపంచంలోని నీటి ఉపరితలంలో 46 శాతం వాటాను కలిగి ఉంది పసిఫిక్ మహాసముద్రం.

పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమ తీరంలో అనేక సముద్రాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా ప్రపంచమంతటా వాణిజ్యం జరుగుతుంది.