Quick Commerce: ఈ కామర్స్‌లో మరో సంచలనం.. 2 గంటల్లోనే దుస్తుల డెలివరీ

దేశంలో ఈ కామర్స్ రంగం రోజురోజుకీ విస్తరిస్తోంది. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే క్విక్‌ కామర్స్‌ పేరుతో వేగంగా వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. తాజాగా మింత్రా కూడా క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది..

Quick Commerce: ఈ కామర్స్‌లో మరో సంచలనం.. 2 గంటల్లోనే దుస్తుల డెలివరీ
Myntra
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2024 | 10:18 AM

ఒకప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్ అంటే.. ఎన్నో అనుమానాలు ఉండేవి. చేత్తో పట్టుకొని చూడకుండా వస్తువులను ఎలా కొనుగోలు చేస్తారని అనుకునే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యాపిల్స్‌ నుంచి ఐఫోన్‌ వరకు అన్నీ వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే రోజులు వచ్చేశాయ్‌. దీంతో ఈ కామర్స్‌ రంగం రోజురోజుకీ పెరిగిపోతోంది. లక్షల టర్నోవర్‌తో ఈ రంగం శరవేగంగా దూసుకుపోతోంది.

ఈ కామర్స్‌ రంగంలో నెలకొన్న పోటీని తట్టుకునే నేపథ్యంలో కంపెనీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే క్విక్‌ కామర్స్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వస్తువును బుక్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే డెలివరీ చేసే సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కిరాణం, గ్రాసరీ వంటి వస్తువులను డెలివరీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే బ్లింకిట్‌ వంటి కొన్ని సంస్థలు ఇప్పటికే క్విక్ కామర్స్‌ ద్వారా ఐఫోన్‌లను డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ కామర్స్‌ దిగ్గజం మింత్రా కూడా క్విక్‌కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టేందుకు యోచిస్తోంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో దుస్తులు బుక్‌ చేసుకుంటే డెలివరీకి కనీసం మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేది. అయితే మింత్రా గంటల్లోనే దుస్తులను డెలివరీ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. కేవలం రెండు గంటల్లోనే డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి బెంగళూరులోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సేవలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తోంది.

ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో, ఎంపిక చేసిన కొన్ని వస్తువులను మాత్రమే డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, ‘M-Now’ బెంగళూరులో కొన్ని పిన్ కోడ్‌లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది. ఇది సక్సెస్ అయితే.. రానున్న రోజుల్లో ఇతర నగరాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కాగా మింత్రా ఇప్పటికే కొన్ని మెట్రో నగరాల్లో ఎం ఎక్స్‌ప్రెస్ పేరుతో డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వస్తువులను ఆర్డర్ చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లో డెలివరీ చేస్తోంది. అయితే ఇప్పుడు కేవలం 2 గంటల్లో డెలివరీ చేయాలని ప్లాన్‌ చేస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..