IPhone 15: ఆ ఐఫోన్లపై బంపర్ ఆఫర్.. నమ్మలేని తగ్గింపులు మీ సొంతం
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఐ ఫోన్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అయితే ధరపరంగా ఐఫోన్ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక ఆఫర్ల సమయంలో కొనుగోలుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-క్రామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, అలాగే విజయ్ సేల్స్ ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రోలపై భారీ తగ్గింపులను ప్రకటించింది.
ఐఫోన్ 15 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉండగా ఐఫోన్ 15 ప్రో విజయ్ సేల్స్ స్టోర్‌లో అద్భుతమైన సబ్ రూ.1,00,000 డీల్‌లో జాబితా చేశారు. ఐఫోన్ 16 రిలీజ్ చేసిన తర్వాత యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ధరను తగ్గించింది. తాజాగా మరింత తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి. యాపిల్ అధికారికంగా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.69,900కి విక్రయిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం మరింత మెరుగైన ఆఫర్‌ను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్‌లో ఐఫోన్ 15 ను రూ. 58,499కి కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ. 11,401 తగ్గింపును అందిస్తుంది. అదనంగా ఈఎంఐ ఎంపికలు నెలకు రూ. 2,057 నుండి ప్రారంభమవుతాయి.
ఐఫోన్ 15 ప్రో విజయ్ సేల్స్‌లో రూ. 1,02,190 ప్రారంభ ధరతో ఉంది. ఈ ఫోన్ ప్రారంభంలో భారతదేశంలో రూ. 1,34,900 వద్ద ప్రారంభించారు. అంటే వినియోగదారులు ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 32,710 భారీ తగ్గింపును అందిస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులకు అదనంగా రూ. 4,500 తగ్గింపును అందిస్తుంది. అంటే దాదాపు రూ.97,690కు ఐఫోన్ 15 ప్రోను పొందవచ్చు. అలాగే ఈఎంఐ ఎంపికలు నెలకు రూ. 4,955 నుంచి ప్రారంభమవుతాయి.
భారతదేశంలో ఐఫోన్ లవర్స్ ఎక్కువ మందే ఉంటారు. అయితే కచ్చితంగా ఐఫోన్ వాడాలని అనుకునే వారికి ఈ ఫోన్ అత్యుత్తమం. కానీ అప్‌డేటెడ్ వెర్షన్ కావాలని కోరుకునే వారు మాత్రం ఐఫోన్ 16 కొనుగోలు చేయడం ఉత్తమం. ఐఫోన్ 15 ప్రోను కొత్త ఐఫోన్ 16 ప్రోతో పోల్చినప్పుడు లాస్ట్ వెర్షన్ మోడల్ ఇప్పటికీ బలమైన ఎంపికగా ఉంది. ఐఫోన్ 15 ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే నాలుగు సంవత్సరాలకు పైగా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందుబాటులో ఉంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి