Jr.NTR: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి ఆర్థిక సాయం చేసిన తారక్..

ఎన్టీఆర్ కు తన ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫ్యాన్స్ కోసం తారక్ ఏమైనా చేస్తారు. కౌశిక్ అనే వీరాభిమాని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనను బతికించాలని డాక్టర్లని వేడుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది.

Jr.NTR: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి ఆర్థిక సాయం చేసిన తారక్..
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2024 | 8:04 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ కు కోట్లమంది అభిమానులు ఉన్నారు. సినిమాలతోనే కాదు వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు తారక్. అలాగే  ఆయన అభిమానులకు ఏ కష్టమొచ్చినా తారక్ తట్టుకోలేరు. నేనున్నా అంటూ భరోసా ఇస్తుంటారు. అలాగే తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని నిత్యం కోరుకుంటూ ఉంటారు ఎన్టీఆర్. అందుకే ప్రతి ఈవెంట్ లో అభిమానులకు జాగ్రత్త చెప్తూ ఉంటారు. కాగా ఎన్టీఆర్ వీరాభిమాని అయినా కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ (19) అనే కుర్రాడు బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. తాను చనిపోయేలోపు ‘దేవర’ సినిమా చూడాలనుకుంటున్నానని, అప్పటివరకు తనను బతికించాలని డాక్టర్లని వేడుకుంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది.

కౌశిక్ తల్లిదండ్రులు కూడా తమ కొడుకును కాపాడాలని ఎన్టీఆర్ ను వేడుకున్నారు. ఆ వీడియో ఎన్టీఆర్ వరకు వెళ్లగా.. స్వయంగా ఆయనే వీడియో కాల్ చేసి, తన వీరాభిమానితో మాట్లాడాడు. అయితే ఇటీవల తన కొడుకుకు సాయం చేయాలని మరోసారి ఆ తల్లి మీడియా ముందుకు రావడంతో ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. కౌశిక్ హాస్పిటల్ బిల్లు కట్టి ఆర్ధిక సాయం చేశారు ఎన్టీఆర్. క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు ఎన్టీఆర్ అభిమాని కౌశిక్. అతని హాస్పటల్ ఖర్చులను ఎన్టీఆర్ కట్టేశారు. ఈ రోజు కౌశిక్ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వనున్నాడు.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే రీసెంట్ గానే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా కమిట్ అయ్యాడు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.