AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అగ్ని NOC టెండర్లలో గోల్‌మాల్.. మాజీ IPS సంజయ్‌పై ఏసీబీ కేసు

మాజీ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విచారణకు ఆదేశించింది ఏసీబీ. మరికొంతమంది లిస్ట్‌ తయారుచేసినట్లు తెలుస్తోంది..! ఈ కేసులో ఏ1గా సంజయ్‌, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: అగ్ని NOC టెండర్లలో గోల్‌మాల్.. మాజీ IPS సంజయ్‌పై ఏసీబీ కేసు
N Sanjay Ips
Balaraju Goud
|

Updated on: Dec 25, 2024 | 8:10 AM

Share

మాజీ IPS అధికారి ఎన్‌.సంజయ్‌పై ACB కేసు నమోదయ్యింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు రావడంతో ఏసీబీ విచారణ చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, CID అడిషనల్‌ డీజీగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి లభించడంతో సంజయ్‌పై కేసు నమోదైంది. ఏ1గా సంజయ్‌, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

అనుమతులు లేకుండా అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్‌ అప్పగించినట్లు తెలిపారు. అలాగే సీఐడీ తరఫున ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు అప్పగించి.. పనులు జరగకపోయినా డబ్బు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఇప్పటికే సంజయ్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయగా, తాజాగా ఏసీబీ కేసు నమోదైంది. దీంతో నిధులు ఏమయ్యాయి..? క్రిత్వ్యాప్, సౌత్రికా కంపెనీలకే వెళ్లాయా..? దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారించనున్నారు అధికారులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?