Garam Masala Benefits: గరం మసాలా ఉపయోగాలు తెలిస్తే షాకే.. రోజూ కూరల్లో వేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

Shaik Madarsaheb

Shaik Madarsaheb | Edited By: Ravi Kiran

Updated on: Aug 02, 2021 | 6:39 AM

Health Benefits of Garam Masala: భారతీయుల వంటల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెజ్ నుంచి.. నాన్ వెజ్ వరకూ ఏ వంట వండినా అన్ని ఘుమఘుమాలాడాల్సిందే. అయితే..

Garam Masala Benefits: గరం మసాలా ఉపయోగాలు తెలిస్తే షాకే.. రోజూ కూరల్లో వేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
Health Benefits Of Garam Masala

Follow us on

Health Benefits of Garam Masala: భారతీయుల వంటల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెజ్ నుంచి.. నాన్ వెజ్ వరకూ ఏ వంట వండినా అన్ని ఘుమఘుమాలాడాల్సిందే. అయితే.. కూరల్లో ప్రత్యేక సువాసన, రుచి కోసం గరం మసాలాను జతచేస్తారు. గరం మసాలా వేసిన తర్వాత వచ్చే సువాసనే వేరు. అందుకే ప్రతిఒక్కరి వంటగదిలో సాధారణంగా సుగంధ ద్రవ్యాల మిశ్రమం గరం మసాలా కచ్చితంగా ఉంటుంది. దీనిని సాధారణంగా లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలుకలు, మిరియాలు, కరక్కయలు, ధనియాలు లాంటి సుగంధద్రవ్యాలతో తయారుచేస్తారు. అయితే ఈ గరం మసాల వల్ల మీకు ప్రత్యేకమైన రుచితోపాటు.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని.. చాలా మందికి తెలియదు. ఈ గరం మసాలాలో అనేక పోషకాలు, ఖనిజాలు దాగి ఉన్నాయి. కావున గరం మసాలా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

∙గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు..

∙ గరం మసాలా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. ఆహారంలో గరం మసాలా ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ మసాలా పొట్టలో గ్యాస్ట్రిక్‌ను తగ్గించే రసాలను విడుదల చేస్తుంది. ఇదే కాకుండా ఉదరం సమస్యలు, ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

∙ గరం మసాలా అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న సుగంధ ద్రవ్యాల కలయిక. ఈ పదార్ధాలలో ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి.

∙ ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి. అందుకే గరం మసాలాను ఆహారంలో చేర్చి ఎక్కువ కేలరీలను బర్న్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

∙ గరం మసాలా గుండె ఆరోగ్యంగా ఉండేలా ఉపయోగపడుతుంది. గరం మసాలాలో ఉపయోగించే యాలకులు గుండె సమస్యలను నివారించడంలో సాయపడతాయి. దీంతోపాటు మీ రక్తపోటు స్థాయిలను (బీపీ) కూడా సులువుగా నియంత్రణలోకి వస్తుంది.

∙ గరం మసాలా క్యాన్సర్ కారకాల ప్రమాదాలను తగ్గిస్తుంది. దీంతోపాటు కొన్ని ఆరోగ్య సమస్యల నివారణ విషయంలో గరం మసాలా దివ్యఔషధంగా పనిచేస్తుంది. మసాలా దినుసుల్లోని పోషకాలు శరీరంలో కణితుల పెరుగుదలను నిరోధిస్తాయి.

∙ అయితే.. గరం మసాలా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి… అతిగా ఉపయోగించకూడదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ముందుగా వైద్య నిపుణులను సంప్రదించాలని కోరుతున్నారు.

Also Read:

Diabetics: చిరుధాన్యాలతో డయాబెటీస్‌కు చెక్ చెప్పొచ్చు.. ఇక్రిశాట్ పరిశోధనలో వెల్లడి!

Dates In Mansoon: వర్షాకాలంలో ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.. రోజూ కనీసం ఐదు తినమంటున్న న్యూట్రిషియన్లు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu