Vinayaka Chavithi: గణేష్ ఆశీస్సుల కోసం ఎలా పూజించాలి .. ఈ ఏడాది పూజకు శుభసమయం ఎప్పుడంటే.

ఈ సంవత్సరం గణేష్ చతుర్థి బుధవారం వచ్చింది. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ప్రాముఖ్యత పెరిగింది. వినాయక చవితి రోజున  రవి యోగం, శుక్ల యోగం, చిత్ర నక్షత్రం కలయిక యాదృచ్ఛికం జరగిందని.. చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. 

Vinayaka Chavithi: గణేష్ ఆశీస్సుల కోసం ఎలా పూజించాలి .. ఈ ఏడాది పూజకు శుభసమయం ఎప్పుడంటే.
Ganesh Puja
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Aug 29, 2022 | 6:17 PM

Vinayaka Chavithi: గణేష్ చతుర్థి .. బుద్ధి, సిద్ధి ప్రదాత అయిన గణపతిని ఆరాధించే పవిత్ర పండుగ, ఈ సంవత్సరం 31 ఆగస్టు 2022 న వినాయక చవితిని జరుపుకోనున్నారు. పురాణాల ప్రకారం గణేశుడు మధ్యాహ్న కాలంలో భాద్రపద శుక్ల పక్షం చతుర్థి తిథి నాడు జన్మించాడు. భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఈ చతుర్థి తిథిని కళంక చతుర్థి అని కూడా అంటారు. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పరిషత్ అధ్యక్షుడు పండిట్ రమేష్ సెమ్వాల్ ప్రకారం ఈ సంవత్సరం గణేష్ చతుర్థి బుధవారం వచ్చింది. దీంతో ఈ ఏడాది వినాయక చవితి ప్రాముఖ్యత పెరిగింది. వినాయక చవితి రోజున  రవి యోగం, శుక్ల యోగం, చిత్ర నక్షత్రం కలయిక యాదృచ్ఛికం జరగిందని.. చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.

గణపతిని పూజించడానికి అనుకూలమైన సమయం పండిట్ రమేష్ సెమ్వాల్ ప్రకారం..  31 ఆగస్టు 2022 న వచ్చే గణేష్ చతుర్థి రోజున గజాననుని పూజించడానికి ఉత్తమ సమయం ఉదయం 11:07నుండి మధ్యాహ్నం 01:39. ఈ రోజు గణపతి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమై.. 10 రోజుల పాటు జరగనున్నాయి. అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది .

పూజలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సనాతన సంప్రదాయంలో, గణపతి పూజా సమయంలో కొన్ని నియమాలను, ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే వ్యక్తి శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను పొందుతాడు. గణపతి పూజలో మరిచిపోయి కూడా తులసి ఆకులను ఉపయోగించరాదు. అదేవిధంగా, గణపతి పూజలో ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను సమర్పించవద్దు.

ఇవి కూడా చదవండి

వినాయకుడిని ఎలా పూజించాలి గణేష్ చతుర్థి నాడు గణపతిని పూజించడానికి, ముందుగా గజాననుడి విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంతో ఒక ఆసనంపై ఏర్పాటు చేసుకోండి. దీని తరువాత గణపతిని ఆవాహన చేయండి. విగ్రహానికి పాలు , పెరుగు , తేనె , స్వచ్ఛమైన నెయ్యి , గంగాజలం మొదలైన వాటితో శుభ్రం చేయండి. అనంతరం గణపతి విగ్రహానికి పుసుపు పూజి.. కుంకుమతో అలంకరించండి.తరువాత, బట్టలు, వస్తువులతో సముచితంగా అలంకరించండి . ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టండి. పండ్లు , చెరకు , అరటి , తమలపాకులు సమర్పించండి. ధూప దీప నైవేద్యంతో గణపతిని పూజించి..  గణపతి వ్రత విధాన కథను పటించండి.

గణపతిని పూజించడానికి గొప్ప మార్గం ఒక పిల్లవాడు చదువు సంధ్యల విషయంలో బలహీనంగా ఉంటే. వినాయక చవితి రోజున గణపతిని పూజించడం శుభఫలితాలను ఇస్తుంది. గణేష్ ఉత్సవంలో వరుసగా 10 రోజులు గణపతి ఆరాధనలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శరీర బాధలు తొలగిపోయి శక్తి , తెలివి, జ్ఞానం లభిస్తాయని నమ్మకం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ