Breaking : ఉత్తరాఖండ్‌కు నేటి నుంచి 3 రాజధానులు…
నేటి నుంచి ఉత్తరాఖండ్ కు అధికారికంగా మరో రాజధాని ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా 'గైర్ సైన్' ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ఉత్తరాఖండ్ కు అధికారికంగా మరో రాజధాని ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా అత్యంత వెనుకబడిన, పర్వత పంక్తులతో కూడిన ‘గైర్‌సైన్’ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. సమ్మర్ క్యాపిటల్ గా ‘గైర్‌సైన్’ కు గవర్నర్ బేబి రాణి మౌర్య ఆమోద ముద్ర పడింది. దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ నోటిఫికేషన్ వెలువరించారు. చమోలి జిల్లాలో ‘గైర్ సైన్’ అనే ప్రాంతం ఉంది. దానిని వేసవి రాజధానిగా చేస్తూ ఇటీవలే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. నూతన రాజధాని ఏర్పాటు చారిత్రాత్మకమని సీఎం రావత్ పేర్కొన్నారు.