జీ4 వైరస్ కొత్తేమి కాదు.. కరోనాలా వ్యాపించదు..
జీ4 వైరస్ గురించి తాజాగా చైనా స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. జీ4 వైరస్ కొత్తదేమి కాదని తేల్చిన చైనా.. .. 2011 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ..

G4 Swine Flu Virus: కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో చైనా పరిశోధకులు ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిగా ప్రబలే ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూ వైరస్‌ను గుర్తించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. G4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరంగా H1N1 జాతి నుండి వచ్చిందని డ్రాగన్ కంట్రీ శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!
ఇదిలా ఉంటే ఈ జీ4 వైరస్ గురించి తాజాగా చైనా స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. జీ4 వైరస్ కొత్తదేమి కాదని తేల్చిన చైనా.. 2011 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ, స్థానికంగా ఉండే హెల్త్ ఏజెన్సీలు క్రమం తప్పకుండా ఈ వైరస్‌ను పర్యవేక్షిస్తున్నాయని పేర్కొంది. అలాగే పందుల్లో కనిపిస్తున్న ఈ వైరస్ కరోనాలా అంత సులభంగా మనుషులకు, జంతువులకు సోకదని తెలిపింది. పందుల్లో కూడా ఈ వైరస్ పూర్తిస్థాయి వ్యాపించిందని చెప్పడానికి శాస్త్రీయంగా ఆధారాలు లేవని చైనా స్పష్టం చేసింది. మహమ్మారిగా మారే అవకాశం లేదని డ్రాగన్ కంట్రీ తేల్చింది. అయితే కరోనా వైరస్ విషయంలో కూడా చైనా మొదట్లో ఇలాగే చెప్పడంతో ఇప్పుడు మరోసారి ఆ దేశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.G4 Swine Flu Virus
