కంటోన్మెంట్‌లో ఆక్రమణలు సహించేది లేదు: మంత్రి తలసాని

నగరంలోని కంటోన్మెంట్ ఏరియాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ద‌ృష్టి సారించిందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ల డెవలప్ మెంట్ దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించినట్లుగా మంత్రి వెల్లడించారు. శనివారం రోజున మంత్రి మల్లారెడ్డితో కలిసి..

కంటోన్మెంట్‌లో ఆక్రమణలు సహించేది లేదు: మంత్రి తలసాని
Follow us

|

Updated on: Jul 04, 2020 | 7:51 PM

హైదరాబాద్  నగరంలోని కంటోన్మెంట్ ఏరియాల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ద‌ృష్టి సారించిందని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కంటోన్మెంట్ల డెవలప్ మెంట్ దిశగా సర్కార్ చర్యలు ప్రారంభించినట్లుగా మంత్రి వెల్లడించారు. శనివారం రోజున మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన కంటోన్మెంట్‌ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నామని వెల్లడించారు.

కంటోన్మెంట్‌కు నెలకు రూ.10 కోట్లు ఇచ్చేలా, తాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బోర్డు, వార్డు సభ్యులు ప్రజల మధ్య ఉంటూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కంటోన్మెంట్‌లో రెవెన్యూ పెంచుకునే దిశగా అధికారులు దృష్టిసారించాలని చెప్పారు. కంటోన్మెట్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ ప్రాంత సమస్యలపై తాను ఎంపీగా ఉన్నప్పు డు పార్లమెంటులో పోరాడానని అన్నారు. కంటోన్మెంట్‌లోని ప్రతి వార్డుకు ప్రత్యేకంగా నిధులు ఇస్తున్నామని తెలిపారు. నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్