Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..

కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిని తలపించే విధంగా ఉన్న ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూను వారు కనుగొన్నారు.

బ్రేకింగ్: చైనాలో మరో కొత్త వైరస్.. మానవజాతికి మరో డేంజర్..
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 30, 2020 | 3:04 PM

కరోనా వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్న తరుణంలో చైనా పరిశోధకులు మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో మహమ్మారిగా ప్రబలే ఓ కొత్త రకమైన స్వైన్ ఫ్లూ వైరస్‌ను వారు కనుగొన్నారు. దానికి సంబంధించి అమెరికా సైన్స్ జర్నల్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. G4 అని పిలువబడే ఈ వైరస్ జన్యుపరంగా H1N1 జాతి నుండి వచ్చిందని వారు అంటున్నారు.

ఈ వైరస్‌ మానవులకు సోకే ప్రమాదం ఉందని.. తొలిదశలోనే అరికట్టాల్సిన అవసరం ఉందని.. లేదంటే మహమ్మారి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చైనీస్ వర్సిటీలు, చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2011 నుండి 2018 వరకు పరిశోధకులు 10 చైనా ప్రావిన్సులు, పశువైద్య ఆసుపత్రిలోని పందుల కళేబరాల నుంచి 30,000 నాజల్ శ్వాబ్స్‌ను తీసుకుని 179 స్వైన్ ఫ్లూ వైరస్‌లను ఐసోలేట్ చేశారు. వాటిల్లో ఎక్కువ సంఖ్య కొత్త రకం వైరస్‌లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇవన్నీ కూడా మనుషులకు సోకే ఛాన్స్ ఎక్కువగా ఉందని.. వాటిపై విస్తృతంగా పరిశోధనలు జరపాల్సి ఉందని అంటున్నారు.

G4 ప్రమాదకరమైన అంటువ్యాధి అని చైనీస్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వైరస్ మూడు ప్రత్యేకమైన జాతుల సమ్మేళనం అని అన్నారు. ఒకటి యూరోపియన్, ఆసియా పక్షులలో కనిపించే జాతుల మాదిరిగా ఉంటుందని, రెండోది 2009లో వచ్చిన సార్స్ఎం,  ఇన్‌ఫ్లూఎంజా మహమ్మారికి కారణమైన H1N1 జాతి అని, మూడోది ఏవియన్, హ్యూమన్, పిగ్ ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌ల జన్యువులతో కలిగి ఉన్న ఉత్తర అమెరికా H1N1 అని తెలిపారు. దీనికి విరుగుడు లేదని.. ఒకవేళ మనుషులకు సంక్రమిస్తే మిగతా ఫ్లూ వైరస్‌ల మాదిరిగా తగ్గదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ వైరస్ చైనా పందుల నుంచి మనుషులకు సంక్రమించిందని.. కానీ మనిషి నుంచి మనిషికి సంక్రమిస్తుందన్న దానికి ఆధారాలు లేవన్నారు.

ప్రస్తుతం విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఫెర్రెట్స్‌తో సహా వివిధ ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్తలు ఫ్లూ సమయంలో మనుషులు అనుభవించే జ్వరం, దగ్గు, తుమ్ములు మాదిరి లక్షణాలే ఉన్నట్లు గమనించారు. అందుకే చైనీస్ మార్కెట్లలో పందులతో పని చేసే వ్యక్తులను దగ్గరగా పర్యవేక్షించాలని పరిశోధకులు చెబుతున్నారు. కాగా, జీ4 వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరించారు.

ఇది చదవండి: ఇంట్లోనే స్వీయ నిర్బంధం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఉంటేనే సేఫ్..