AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google layoffs in 2025: గూగుల్‌ల్లో మళ్లీ ఊచకోత.. డేంజర్‌ జోన్లో బెంగళూరు, హైదరాబాద్‌! వేలాది ఉద్యోగాలు ఉఫ్..

ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్‌ దిగ్గజాలు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. వ్యయాలు తగ్గించుకోవడంతో పాటు పునర్నిర్మాణంలో భాగంగా ఏఐ వంటి సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వడానికి వీలుగా ఆయా కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. తాజాగా గూగుల్‌ ఈ ఏడాది మరోమారు లేఆఫ్‌లను ప్రకటించింది..

Google layoffs in 2025: గూగుల్‌ల్లో మళ్లీ ఊచకోత.. డేంజర్‌ జోన్లో బెంగళూరు, హైదరాబాద్‌! వేలాది ఉద్యోగాలు ఉఫ్..
Google Layoffs
Srilakshmi C
|

Updated on: Apr 21, 2025 | 11:19 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సంస్థల్లో లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్లో మరో రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. ఈసారి ఉద్యోగాల కోతలు భారీగానే ఉండనున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరులోని గూగుల్ కార్యాలయాలలో ఈ లేఆఫ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్‌లో దీని ఉద్యోగుల తొలగింపులను గూగుల్ అధికారికంగా ధృవీకరించనప్పటికీ బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ వచ్చే వారంలోనే ప్రారంభం కావచ్చని పేర్కొంది. గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లు, డివైజెస్‌ డివిజన్‌లో తాజాగా జరిగిన రీకన్‌స్ట్రక్షన్‌ తర్వాత తాజా వార్తలు వెలువడ్డాయి. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సంస్థల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై వేటు పడనుంది. ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్‌ బ్రౌజర్‌ను నిర్వహిస్తున్న తన ప్లాట్‌ఫామ్స్‌ అండ్‌ డివైజెస్‌ యూనిట్‌లో వందలాది మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది.

అయితే భారత్‌లో గూగుల్ కొంచెం ఎక్కువగానే ఈ విషయంపై దృష్టి సారించినట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంపై ఫోకస్‌ పెట్టింది. ప్రత్యక్ష తొలగింపులకు బదులుగా హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో సాంకేతిక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై వేటు పడనుంది. కంపెనీ అంతర్గత నిర్మాణంలో విస్తృత మార్పుల మధ్య గూగుల్ కొత్త తొలగింపులు చేపట్టింది. గత ఏడాది గూగుల్ తన ప్లాట్‌ఫామ్‌లు, పరికరాల బృందాలను విలీనం చేసింది. 2024లో ఆండ్రాయిడ్, పిక్సెల్‌ విభాగాలను విలీనం చేసిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలోనే అమెరికాలోని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించింది. ఫిబ్రవరిలో గూగుల్‌ క్లౌడ్‌ విభాగం నుంచి ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నుంచి స్వచ్ఛందంగా నిష్క్రమించడానికి జనవరిలో ఉద్యోగులకు బైఅవుట్ ఆప్షన్ ఇచ్చినట్లు గూగుల్ కూడా ధృవీకరించింది.

అనేక ఇతర ప్రధాన సాంకేతిక సంస్థల మాదిరిగానే గూగుల్ కూడా మారుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నావిగేట్ చేస్తోంది. ఉత్పాదక AI పెరుగుదల, అధిక ప్రాధాన్యత గల వ్యాపార రంగాలతో ఖర్చును తగ్గించుకోవడానికి గూగుల్ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఒత్తిళ్లు టెక్ కంపెనీలు, స్టార్టప్‌లు పనితీరు ఆధారిత మూల్యాంకనాలు, బృంద ఏకీకరణలు, వ్యయ సామర్థ్యాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలను స్వీకరించడానికి దారితీశాయి. లేఆఫ్‌ డాట్‌ ఎఫ్‌వైఐ ప్రకారం.. 2025 ప్రారంభం నాటికి ప్రపంచవ్యాప్తంగా 108 కంపెనీలలో 28 వేల మందికి పైగా టెక్ కార్మికులు ఉపాధి కోల్పోయారు. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రధాన కంపెనీల్లో ఈ లేఆఫ్‌లు చోటుచేసుకున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ మే 2025 నాటికి కొత్తగా మరికొంత మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

కంపెనీ మిడిల్-మేనేజ్‌మెంట్ పాత్రల నుంచి ఉద్యోగులను తగ్గించాలని, ఇంజనీర్ల నిష్పత్తిని నాన్-టెక్నికల్ సిబ్బందికి పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మైక్రోసాఫ్ట్ భద్రతా విభాగం కూడా దాని ఇంజనీర్-టు-మేనేజర్ నిష్పత్తిని గణనీయంగా పెంచడానికి కసరత్తు చేస్తుంది. ప్రస్తుత 5.5:1 నుంచి 10:1కి పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. 80 లేదా అంతకంటే తక్కువ పనితీరు రేటింగ్‌ ఉన్న ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఇక భారత్‌ గూగుల్ ఉద్యోగాల కోత ఇదేం మొదటిసారి కాదు. 2023లో ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. అంటే దాని ఉద్యోగులలో దాదాపు 6 శాతం అన్నమాట.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!