AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా కెరీర్‌లో చెత్త సినిమా అదే.. మనస్ఫూర్తిగా చేయలేదు.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారాడు నటుడు ప్రియదర్శి. కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నవ్వులు పూయించాడు. ఆతర్వాత మెల్లగా హీరోగా మారాడు. మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత హీరోగా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ప్రియదర్శి.

నా కెరీర్‌లో చెత్త సినిమా అదే.. మనస్ఫూర్తిగా చేయలేదు.. ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్
Priyadarshi
Rajeev Rayala
|

Updated on: Apr 21, 2025 | 10:51 AM

Share

కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ హీరోగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు నటుడు ప్రియాదర్శి.. కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తన కామెడీ టైమింగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయ్యేడు ప్రియదర్శి. ఆతర్వాత ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా చేశాడు. ఆతర్వాత హీరోగా మారి పలు సినిమా చేసి మెప్పించాడు. ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన సినిమాల్లో బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలగం సినిమాతో ప్రియదర్శి క్రేజ్ మారిపోయింది. తన నటనతో బలగం సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచాడు దర్శి. ఈ సినిమా తర్వాత ఇప్పుడు వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తున్నాడు.

ఇటీవల కోర్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్స్ లో కోర్ట్ సినిమాకు మంచి రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది ఈ మూవీ.. ఇక ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు దర్శి. ఇదిలా ఉంటే తాజాగా దర్శి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హీట్ పుట్టిస్తున్నాయి. తన కెరీర్ లో చెత్త సినిమా అంటూ దర్శి కామెంట్స్ చేశాడు.అయితే ఆ సినిమా ఏదంటే..

ఇవి కూడా చదవండి

ప్రియదర్శి నటించిన సినిమాల్లో మిఠాయి సినిమా ఒకటి.. ఈ సినిమా చేసి తాను తప్పు చేశా అని అన్నారు. ఆ సినిమా తన కెరీర్ లో ఓ చెత్త సినిమా అని.. ఆ సినిమాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోలేదు. డైరెక్టర్ కూడా అంత ఆసక్తిగా ఆ సినిమా చేయలేదు. మిఠాయి చిత్రం నుంచి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని తెలుసుకున్నా.. నాకు ఓ క్లారిటీ వచ్చింది. ఇక కెరీర్ బెస్ట్ మూవీ అంటే కోర్ట్ సినిమా అనే చెప్పాలి.. 9 ఏళ్ళ నా కెరీర్ లో నేను తీసుకున్న మంచి నిర్ణయం కోర్ట్ మూవీని ఒప్పుకోవడం అని దర్శి చెప్పుకొచ్చాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!