AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడు నా అయ్యా అంటూ అదరగొట్టిన శ్రీహరి.. ఆ హీరో పేరు చెప్పగానే ఆడిటోరియం దద్దరిల్లింది…

విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.

వాడు నా అయ్యా అంటూ అదరగొట్టిన శ్రీహరి.. ఆ హీరో పేరు చెప్పగానే ఆడిటోరియం దద్దరిల్లింది...
Actor Srihari
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2025 | 12:37 PM

Share

ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు దివంగత నటుడు శ్రీ హరి. విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలో చేశారు. తెలుగు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహాయక పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా మారారు శ్రీహరి. తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ చెప్పే మాట. 1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి…అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు శ్రీహరి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి ముందు అథ్లెట్ అవ్వాలనుకున్నారు. ఆతర్వాత సినిమాల పై ఇష్టం పెంచుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. 2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. ఓ వైపు హీరోగా చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

2013 న కాలేయ సంబంధ వ్యాధి కారణంగా ముంబై లో కన్నుమూసారు శ్రీహరి. కాగా శ్రీ హరికి సంబందించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో శ్రీహరి ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమ వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ శ్రీహరి కలిసి బృందావనం సినిమాలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీ హరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నా అయ్యా.. నేను నాన్న అని పిలుస్తాను. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నేను ఎన్టీఆర్ ను నాన్న అనే పిలిచాను అని అన్నారు. శ్రీ హరి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు హర్షద్వానాలతో ఆడిటోరియం దద్దరిల్లింది.

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

View this post on Instagram

A post shared by Jr NTR (@ntr_admirers)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.