AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయట పడ్డ స్టార్ హీరో

స్టార్ హీరో అజిత్ కు కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రేస్ లోనూ పాల్గొంటూ ఉంటాడు. అయితే ఇటీవల అజిత్ వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. రేసింగ్ లో ఆయన కారు పలు మార్లు ప్రమాదానికి గురయ్యింది. తాజాగా మరోసారి అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ కు గాయాలు కాలేదని తెలుస్తుంది.

మరోసారి అజిత్ కారుకు ప్రమాదం.. సురక్షితంగా బయట పడ్డ స్టార్ హీరో
Ajith
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2025 | 12:57 PM

Share

తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ కారు రేసింగ్‌లో పాల్గొంటూ ఇటీవల పలు ప్రమాదాలకు గురయ్యారు.అజిత్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయట పడ్డారని సమాచారం. కాగా ఈ ప్రమాదంలో అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, ఆయన క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి ఇతర కార్లే కారణమని తెలిపింది.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కూడా ఆయన టీమ్ రేస్‌లో విజయం సాధించింది.  అంతకుముందు, 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ పోటీల కోసం శిక్షణలో ఉండగా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, మెకానిక్ బృందం దాన్ని సరిచేసింది. అజిత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించారు.

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా రూ.200కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పుడు అజిత్ కారు ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయనకు గాయాలు కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..