AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే హీరోయిన్.. ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యి ఇలా..

నిన్న మొన్నటి వరకు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వాళ్లు.. ఇప్పుడు హీరో, హీరోయిన్స్ గా మారిపోతున్నారు. అంతే కాదు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో గ్యాప్ లేకుండా గడిపేస్తున్నారు. ఇప్పటికే తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది హీరో హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా అదే లిస్ట్ లోకి వస్తుంది.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. కట్ చేస్తే హీరోయిన్.. ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యి ఇలా..
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 19, 2025 | 11:51 AM

Share

ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా క్యూట్ గా కనిపించిన వారు ఇప్పుడు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు. ఏకంగా హీరో.. హీరోయిన్స్ రేస్‌లోకి వచ్చిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. తేజ సజ్జా అలా వచ్చి ఇప్పుడు స్టార్ హీరోగా టర్న్ అవుతున్నాడు. కావ్య కల్యాణ్ రామ్ కూడా హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇలా ఇంకొంతమంది ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో చిన్నది వచ్చి చేరింది. పై ఫొటోలో సూర్య, జ్యోతికతో ఉన్న ఈ చిన్నారి గుర్తుందా.? ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అయ్యిద్ది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : ఇదెక్కడి సినిమారా మావ..! థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. ఓటీటీలో 11 ఏళ్లుగా ట్రెండింగ్..

సూర్య హీరోగా నటించిన సినిమాల్లో నువ్వు నేను ప్రేమ సినిమా ఒకటి. ఈ సినిమాలో సూర్యకు జోడీగా జ్యోతిక నటించింది. అలాగే ఈ సినిమాలో భూమిక కూడా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో భూమిక తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంలో స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేస్తుంది. ఇంతకూ ఆ చిన్నారి ఎవరో తెలుసా.? ఆమె పేరు శ్రియ శర్మ. తెలుగు, తమిళ్ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఈ చిన్నది ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. ఆ మధ్య శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ప్రేమించి పెళ్లాడింది.. ముడుఏళ్ళకే విడాకులు.. కట్ చేస్తే మరొకరితో ఎఫైర్, మ్యారేజ్

అలాగే గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకాదు. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్. దాంతో ఈ చిన్నదాని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో .. చూస్తే అవాక్ అవ్వాల్సిందే. హీరోయిన్స్ ను మించిన అందంతో వయ్యారంతో ఆకట్టుకుంటుంది శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించింది ఈ ముద్దుగుమ్మ. ఈ చిన్నదాని తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డు అందుకున్న శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తోంది. సినిమాల కంటే ఆమె లాయర్ వృత్తిపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి : తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్.. కొత్తగా ఉందన్న దర్శకుడు పై మండిపడుతున్న నెటిజన్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.