- Telugu News Photo Gallery Cinema photos Jr. NTR gets blockbuster hit with Ram Charan's rejected movie
చరణ్ కోసం కథ రెడీ చేసిన మూవీలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చిన తారక్.. తర్వాత సీన్ కట్ చేస్తే !
చాలా మందికి రామ్ చరణ్, తారక్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా వీరి కాంబోలో సినిమా వస్తే ఫ్యాన్స్ లో ఉండే ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత వీరి క్రేజ్ మరింత పెరిగింది. అయితే తాజాగా ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?
Updated on: Apr 19, 2025 | 11:53 AM

సినీ ఇండస్ట్రీలో ఒకరి కోసం కథ రెడీ చేస్తే మరొకరు చేయడం అనేది చాలా కామన్. కొందరు హీరోలు రిజక్ట్ చేసిన సినిమాతో మరో హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడు. అయితే అలానే ఒక హీరో కోసం రెడీ చేసిన కథలోకి మరో హీరో సడనె ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

అతనెవరో కాదు, జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్ అవుతుంది. అయితే కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది.

అయితే దర్శకుడు ముందుగా ఈ కథను రామ్ చరణ్ కోసం రాశాడంట. అంతే కాకుండా ఆయనతో ఈ సినిమా తీయాలనుకున్నాడంట. కానీ కొన్ని కారణాల వలన చరణ్ ఈ సినిమాను ఓకే చేయకపోవడంతో, తారక్ ఈ సినిమాలోకి వచ్చారు.

దర్శకుడు తారక్ కు కథ చెప్పడంతో ఆయనకు కథ బాగా నచ్చి ఒకే చెప్పేడాంట. ఇలా జనతా గ్యారేజ్ సినిమా రామ్ చరణ్ కు మిస్సైంది, ఈ మూవీతో తారక్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటకు మంచి ప్రశంసలు అందాయి.

ఇక దేవరతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్, త్వరలో వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనన్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమాతో అభిమానులను ఎంటర్టైన్ చేయనున్నారు.



