Tirupati: ఆ ఏరియాల్లోని రోడ్లపై బర్త్‌డే వేడుకలు చేస్తున్నారా?.. అయితే ఈ వార్నింగ్ మీకే?
రోడ్లపై బర్తుడేలు చేసుకుంటూ, బాణాలు కాలుస్తూ హంగామా చేసే యువతకు తిరుపతి పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు బర్త్‌డే పార్టీలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Tirupati: ప్రస్తుత రోజుల్లో యువత ఎలా ఉన్నారో తెలుసు కాదా.. ఎవరిదైనా బర్త్‌డే వచ్చిందటే చాలు దాన్ని పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్లపైకి వచ్చి కేక్ కటింగ్‌లు, బాణసంచా పేల్చడాలు.. ఇలా నానా హంగామా చేస్తుంటారు. రోడ్లపై ఫోటోలు దిగుతూ బైక్‌లతో స్టంట్లు చేస్తూ నానా రచ్చ చేస్తారు. అయితే ఇదే విషయంపై తిరుపతి యువతకు పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై నగరంలో సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఎలాంటి బర్త్‌డే పార్టీలు, బాణసంచా కాల్చడాలు పెట్టుకోవద్దని తెలిపారు. అలా కాదని ఎవరైనా ప్రజలకు, భక్తులకు ఇబ్బంది కలిగేలా బాణసంచా కాల్చినా.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై కేక్‌లు కట్ చేసినా కేసులు నమోదు చేస్తామన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బైరాగిపట్టెడ, ఎస్టివీనగర్, శివజ్యోతినగర్, సత్యనారాయణపురం, రైల్వే కాలనీ, ఉపాధ్యాయనగర్ వంటి ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఒకటి రెండు సార్లు చెప్పిన తర్వాత కూడా వినకుండా ఆలానే ప్రవర్తిస్తే.. పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
