AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్చీలో కుంపటి.. గంటల తరబడి కూర్చునే ఉంటున్నారా..? డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నట్లే..

నేటి యువతలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, డెస్క్ ఉద్యోగాలు, ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి.. ? నిపుణులు ఏం చెబుతున్నారు. ఈ వివరాలను తెలుసుకోండి..

కుర్చీలో కుంపటి.. గంటల తరబడి కూర్చునే ఉంటున్నారా..? డేంజర్ జోన్‌లోకి వెళ్తున్నట్లే..
Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2025 | 10:44 AM

Share

ఉరుకులు పరుగుల జీవితం.. అనారోగ్యకరమైన ఆహారం, పేలవమైన జీవనశైలి.. ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో యువతలో ఒక కొత్త సమస్య వేగంగా వ్యాపిస్తోంది.. అదే ఫ్యాటీ లివర్. గతంలో ఈ కాలేయ వ్యాధి వృద్ధులకే పరిమితం అని భావించేవారు.. కానీ ఇప్పుడు ఇది యువతలో కూడా ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు స్క్రీన్ ముందు ఎక్కువసేపు గడపడం, డెస్క్ ఉద్యోగాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి చెడు ఆహారపు అలవాట్లు.. సకాలంలో చికిత్స చేయకపోతే ఈ సమస్య క్రమంగా తీవ్రమవుతుందని.. పేర్కొంటున్నారు వైద్య నిపుణులు..

గతంలో నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అని పిలిచిన ఫ్యాటీ లివర్ సమస్యను ఇప్పుడు మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ (MASLD) అని పిలుస్తున్నారు. ఈ వ్యాధి ఇప్పుడు ఊబకాయం ఉన్నవారిలోనే కాకుండా సాధారణ బరువు, సన్నగా ఉన్నవారిలో కూడా వ్యాపిస్తోంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఐటీ రంగంలో పనిచేస్తున్న 80% కంటే ఎక్కువ మంది MASLD బారిన పడ్డారని తేలింది.

పెరుగుతున్న ముప్పు..

ప్రారంభంలో ఫ్యాటీ లివర్ కు నిర్దిష్ట లక్షణాలు ఉండవు.. అందుకే ఈ వ్యాధి నెమ్మదిగా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH), సిర్రోసిస్ లేదా కాలేయ క్యాన్సర్ వంటి తీవ్రమైన రూపాలను తీసుకోవచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, కడుపులో బరువుగా అనిపించడం, అలసట లేదా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు కాలేయ వ్యాధి తరచుగా గుర్తించబడుతుంది.

లావుగా ఉన్నవారే కాదు.. సన్నగా ఉన్నవారు కూడా బాధితులే..

కొవ్వు కాలేయం ఇప్పుడు ఊబకాయం ఉన్నవారిని మాత్రమే కాకుండా సాధారణ BMI ఉన్న సన్నగా ఉన్నవారిని కూడా ప్రభావితం చేస్తోంది. దీని వెనుక, జన్యుపరమైన కారకాలు, ఇన్సులిన్ నిరోధకత, అంతర్గత ఉదర కొవ్వు పాత్ర ముఖ్యమైనది. ఈ వ్యాధి జీవనశైలి, ఆహారపు అలవాట్లకు కూడా సంబంధించినదని, ఇప్పుడు దాని గురించి అవగాహన పెంచడం చాలా ముఖ్యం అని నిపుణులు అంటున్నారు.

ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం..

ఎక్కువసేపు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం ఫ్యాటీ లివర్ కు ప్రధాన కారణాలు. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. యువత రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయడంతోపాటు.. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించినట్లయితే, ఈ సమస్యను నివారించవచ్చు.

మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది..

కొవ్వు కాలేయం శరీరాన్ని మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని కొత్త పరిశోధనలో వెల్లడైంది. కాలేయం బలహీనపడినప్పుడు, అది మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. రోగులు జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్థితిలో మార్పులు, నిద్ర సమస్యలను అనుభవించవచ్చు.

నివారణ చాలా ముఖ్యం..

నిపుణులు చెప్పేదేంటంటే, ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నవారికి, సాధారణ ఆరోగ్య పరీక్షలలో కొవ్వు కాలేయ పరీక్షను చేర్చాలి. ఈ వ్యాధి మరింత తీవ్రం కాకముందే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..