- Telugu News Photo Gallery Mini Thailand of India: Jibhi in Himachal pradesh Summer Vacation in a Picturesque Himalayan Paradise
Mini Thailand India: మన దేశంలో మినీ థాయిలాండ్‌ను వేసవిలో సందర్శించండి.. జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది..
వేసవి కాలం అయినా, శీతాకాలం అయినా.. ఎక్కువ మంది పర్వత ప్రాంతాల్లో పర్యటించాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రకృతిలోని అందాలను చూడడం ఒక మధురానుభూతి. బిజీబిజీ లైఫ్ నుంచి రిలీఫ్ ను ఇస్తుంది. మనసుకి శాంతినిస్తుంది. అయితే వేసవి సెలవులు ఎక్కువ రోజులు వస్తాయి. దీంతో ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ కి ప్లాన్ చేస్తుంటారు. అటువంటివారు భారతదేశంలోని 'మినీ థాయిలాండ్'ను సందర్శించవచ్చు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఈ రోజు ప్రకృతి అందాలతో కనువిందు చేసే మినీ థాయిలాండ్ గురించి తెల్సుకుందాం..
Updated on: Apr 21, 2025 | 11:25 AM

వేసవిలో పర్వత ప్రాంతాలను, చల్లని ప్రదేశాలను సందర్శించడానికి అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే చల్లని, స్వచ్ఛమైన గాలి , పచ్చని పర్వతాల అందమైన దృశ్యాలు మనసుకి ప్రశాంతతను అందిస్తాయి. పిల్లల పాఠశాల సెలవులు ప్రారంభమైన తర్వాత ఫ్యామిలీ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడిపేందుకు ఆనందమైన పర్యాటక ప్రాంతల్లో వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తారు. వేసవి సెలవులే మనాలి, నైనిటాల్, సిమ్లా వంటి ప్రదేశాల్లో పర్యటించేందుకు ఉత్తమ సమయం. వేసవిలో ఈ ప్రదేశాలలో రద్దీ చాలా పెరగడానికి ఇదే కారణం. ఈ రోజు మినీ థాయిలాండ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక ప్రదేశం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రకృతి దృశ్యాలు చలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

వేసవి సెలవుల్లో మంచి పర్యాటక ప్రాంతం.. మనసుకు ఉల్లాసాన్ని ఇచ్చే ప్రాంతం కోసం చూస్తారు. కొత్త ప్రదేశంలో పర్యటన జీవితానికి సరికొత్త అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాదు వివిధ ప్రాంతాల జన జీవనాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని, ఆచరణాత్మక విషయాలను అర్థం చేసుకోవాలనుకున్నా లేదా వివిధ ప్రదేశాల గురించి తెలుసుకోవాలనుకున్నా ప్రయాణించాలి. ఈ రోజు మనదేశంలో ఉన్న అందమైన మినీ థాయిలాండ్ గురించి తెలుసుకుందాం..

హిమాచల్ జిబి: వేసవి సెలవులను జీవితాంతం అందమైన జ్ఞాపకంగా గుర్తు పెట్టుకోవాలంటే మీ బ్యాగులు సర్దుకుని హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరండి. ఇక్కడ మినీ థాయిలాండ్ ఇక్కడ ఉంది. ఈ ప్రదేశం మీకు స్వర్గంలో ఉన్న అనుభూతినిస్తుంది. నిజానికి ఇక్కడ ఒక ప్రదేశంలో రెండు భారీ బండరాళ్లు మధ్య నది ప్రవహిస్తోంది. ఇది చూసేందుకు సరిగ్గా థాయిలాండ్ బీచ్ లాగా కనిపిస్తాయి. దీనిని పచ్చదనం మధ్య దాచిన రత్నం అంటారు. ఇక్కడ ఒక అందమైన రాతి గుడిసె కూడా నిర్మించబడింది. పర్యాటకులు ఈ ప్రదేశాన్ని మినీ థాయిలాండ్ అని పిలుస్తారు. అయితే అక్కడ నివసించే ప్రజలు ఈ ప్రదేశాన్ని కూలి కంటడి అని పిలుస్తారు. ఇక్కడి నీరు చాలా స్పష్టంగా ఉంటుంది. దీన్ని చూస్తే మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది.

ఋషి శృంగ ఆలయం: మీరు జిభికి వెళితే తప్పకుండా తప్పక ఋషి శృంగ ఆలయాన్ని సందర్శించండి. ఈ ఆలయం కులులోని 18 ప్రధాన దేవతలలో ఒకరిగా పరిగణించబడే ఋషి శృంగకు చెందినది. ఈ ఆలయం.. దీని సహజ సౌందర్యంతో అద్భుతంగా ఉంటుంది.

సెరువల్సర్ సరస్సు: జిభి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెరోలసర్ సరస్సు అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. సరోయుల్సర్ సరస్సు నీరు స్ఫటికంలా స్పష్టంగా ఉంటుంది. సరస్సు నీటిలో మీకు చెత్త కనిపించదు. భారతదేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఈ సరస్సును చూడటానికి ఇక్కడకు వస్తారు. ఇక్కడ ఒక ఆలయం కూడా నిర్మించబడింది. దీనిని తప్పక సందర్శించాలి.

జాలోరీ పాస్: మీరు జిభికి వెళితే జాలోరీ పాస్ స్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ తీర్థన్ నది ఉంది. దానితో పాటు లోయ.. పైన్ అడవుల అద్భుతమైన దృశ్యాలు కూడా కనువిందు చేస్తాయి. ఈ ప్రాంతం ఫోటోగ్రఫీకి ఉత్తమమైనది.

జిభి జలపాతం: ఈ ప్రదేశం సహజ సౌందర్యానికి నిలయం. పర్వతాల నుంచి పడే నీరు , పచ్చదనం మధ్య మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. మీలో శక్తి వచ్చినట్లు.. ఎనర్జీ వచ్చిన అనుభూతి చెందుతారు.




