Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • విజయవాడ: ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషన్. ఎలక్షన్ కమీషనర్ కార్యాలయంలో వాస్తు మార్పులు అన్న వార్తలు అవాస్తవం. ఎటువంటి నమ్మకాలకు తావులేని వ్యక్తి ఎలక్షన్ కమీషనర్. ఆయన లేని సమయంలో కార్యాలయంలో కొన్ని మార్పులు జరిగాయి. కార్యాలయంలో మార్పులను ఎవరు నిర్ధారించారో విచారణ జరుగుతోంది.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!

కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 'ప్రథమ్‌' అనే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ నూతన అప్లికేషన్‌ను ఆగష్టు 1న లాంచ్ చేయనుంది.
APSRTC To Launch Pratham App, ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక నుంచి టికెట్‌లెస్ ప్రయాణం..!

కరోనా వైరస్ నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘ప్రథమ్‌’ అనే పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ఈ నూతన అప్లికేషన్‌ను ఆగష్టు 1న లాంచ్ చేయనుంది. సూపర్ లగ్జరీ సర్వీసుల దగ్గర నుంచి పల్లెవెలుగు బస్సుల దాకా అన్ని టికెట్లను దీని ద్వారానే బుక్ చేసుకునే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది.

Also Read: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు మరో ఛాన్స్.. గడువు పొడిగింపు..!

ఇక ఈ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ధరలో ఐదు శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతోన్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి నగదురహిత లావాదేవీలను జరిపేందుకు వీలుగా ఈ ‘ప్రథమ్‌’ యాప్‌ను రూపొందించామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌ను కూడా అప్‌గ్రేడేషన్ చేశారు. కాగా, ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,934 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Also Read: కుల ధృవీకరణ లేకుండానే మైనారిటీలకు ‘వైఎస్ఆర్ చేయూత’…

Related Tags