ఏపీలోకి సీబీ’ఐ’ రీ ఎంట్రీ..యరపతినేనిదే మెుదటి కేసు!
టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం… దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ […]
టీడీపీ నేత యరపతినేనిపై దాఖలైన అక్రమ మైనింగ్ కేసును.. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కోణంకి, దాచేపల్లి మండలంలోని కేసనపల్లి, నడికుడి గ్రామాల్లోని సున్నపురాతి గనుల తవ్వకాలు, రవాణాపై విచారణ చేయాలని చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ చేసిన సీఐడీ విభాగం… దర్యాప్తునకు సంబంధించిన వివరాలను సీబీఐకి పంపింది. ఈ కేసు సీబీఐ విచారణకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేస్తున్నట్టు రాష్ట్ర హోంశాఖ పేర్కోంది. రాష్ట్రంలో సీబీఐకి సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్) పునరుద్ధరణ అనంతరం కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకు తొలికేసు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టైంది. ఇదే సమయంలో కేంద్రం సీబీఐకి అప్పగించేందుకు వీలుగా కావాల్సిన సమాచారం..కోర్టులో జరగిన ప్రొసీడింగ్స్.. రాష్ట్ర ప్రభుత్వ జారీ చేసిన ఉత్తర్వులతో కూడిన పూర్తి నివేదికను కేంద్ర హోం శాఖకు ఏపీ ప్రభుత్వం అందచేసింది.
గతంలో చంద్రబాబు హాయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏపీలో సీబీఐ విచారణకు అనుమతి లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఉత్తర్వులను రద్దు చేసి..తిరిగి సీబీఐకి అవకాశం కల్పించారు.