బ్రేకింగ్: సినీనటుడు వేణుమాధవ్‌కు తీవ్ర అస్వస్థత..!
ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వేణుమాధవ్. యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్ సాయంతో.. వేణు మాధవ్‌కి చికిత్స అందిస్తున్న వైద్యులు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా తలెత్తడంతో.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. పలు హిట్ చిత్రాల్లో నటించిన వేణు మాధవ్.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. కమేడియన్స్‌లో ఆయనకంటూ.. ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిమిక్రీ […]
ప్రముఖ టాలీవుడ్ కమేడియన్ వేణుమాధవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వేణుమాధవ్. యశోద హాస్పిటల్‌లో వెంటిలేటర్ సాయంతో.. వేణు మాధవ్‌కి చికిత్స అందిస్తున్న వైద్యులు. గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో.. పాటుగా కిడ్నీ సమస్య కూడా తలెత్తడంతో.. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
పలు హిట్ చిత్రాల్లో నటించిన వేణు మాధవ్.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించారు. కమేడియన్స్‌లో ఆయనకంటూ.. ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మిమిక్రీ కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు మాధవ్.. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘సంప్రదాయం’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమాతో.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణు మాధవ్.