బిగ్ బ్రేకింగ్: ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం- ఉత్తరాదిన ప్రకంపనలు

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఫలితంగా ఢిల్లీ, పంజాబ్​, హరియాణాలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలోని​ రావల్పిండికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఢిల్లీలోని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం-ఎన్​సీఎస్​ అధికారులు తెలిపారు. తీవ్రత 6.3గా ఉండొచ్చని అంచనా వేశారు. పాకిస్థాన్​లో భారీ భూకంపం.. ఉత్తర పాకిస్థాన్​లోని అనేక నగరాలను భూకంపం కుదిపేసింది. ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్​లో 5.7 […]

బిగ్ బ్రేకింగ్: ఇండో-పాక్​ సరిహద్దులో భూకంపం- ఉత్తరాదిన ప్రకంపనలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2019 | 6:26 PM

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఫలితంగా ఢిల్లీ, పంజాబ్​, హరియాణాలో భూమి కంపించింది. ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్థాన్​ పంజాబ్​ రాష్ట్రంలోని​ రావల్పిండికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు ఢిల్లీలోని జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం-ఎన్​సీఎస్​ అధికారులు తెలిపారు. తీవ్రత 6.3గా ఉండొచ్చని అంచనా వేశారు.

పాకిస్థాన్​లో భారీ భూకంపం..

ఉత్తర పాకిస్థాన్​లోని అనేక నగరాలను భూకంపం కుదిపేసింది. ఇస్లామాబాద్, పెషావర్, రావల్పిండి, లాహోర్​లో 5.7 తీవ్రతతో 8-10సెకన్ల పాటు భూమి కంపించినట్లు పాకిస్థాన్ నుంచి సమాచారం అందుతోంది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపింది.లాహోర్‌కు వాయవ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ఫ్రావిన్సులోని రావల్పిండి పట్టణం ఈ భూకంప కేంద్రానికి సమీపంగా ఉంది.  ఇప్పటివరకు అందుతోన్న సమాచారం ప్రకారం 15 మంది చనిపోయినట్టు, 100ల మందికి గాయాలైనట్టు తెలుస్తుంది. కాగా పాక్ ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. భూమి  రోడ్డుపై కృంగిపోవడంతో పలు వాహనదారులు గాయపడ్డారు.