యూత్ లీడర్ గా మొదలై ఎమ్మెల్యేగా ఎదిగిన ద్రోణంరాజు

విశాఖపట్నం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే వీఎంఆర్డీ మాజీ ఛైర్మన్, ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.

యూత్ లీడర్ గా మొదలై ఎమ్మెల్యేగా ఎదిగిన ద్రోణంరాజు
Follow us

|

Updated on: Oct 04, 2020 | 4:58 PM

విశాఖపట్నం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే వీఎంఆర్డీ మాజీ ఛైర్మన్, ద్రోణంరాజు శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరోనా నుండి కోలుకున్నప్పటికీ… ఆరోగ్యం క్షీణించడంతో నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ద్రోణంరాజు శ్రీనివాస్ మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. హాస్పిటల్ కి వెళ్లిన రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవ౦తి శ్రీనివాస్ ద్రోణ౦రాజు కుమారుడిని, కుటుంభ సభ్యులను పరామర్శించారు.

వీఎంఆర్డీఏ తొలి ఛైర్మెన్ గా ద్రోణంరాజు శ్రీనివాస్ పనిచేశారు. నెల రోజుల క్రితం ఆయనకు కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఆయన కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నారు. అనప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆయన ఆస్పత్రిలో ఉంటూ చికిత్సపొందుతున్నారు. ఆదివారం ఆరోగ్యం మరింత క్షీణించింది తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.

2014,2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, 2019లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 మార్చి నెలలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ద్రోణంరాజు శ్రీనివాస్ 1961, ఫిబ్రవరి 1వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ కుమారుడే శ్రీనివాస్. 1980 81 మధ్య కాలంలో బుల్లయ్య కళాశాలలో చదివేరోజుల్లోనే రాజకీయాలపట్ల అకర్షితులయ్యారు. ఎన్ఎస్ యూఐ నేతగా కూడా ఆయన పనిచేశారు.

1984 85 లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ లీడర్ గా పనిచేశాడు. 1987 89 లలో జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేశాడు. 1991 నుండి 1997 వరకు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2001 నుండి 2006 వరకు విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని నిర్వహించారు. తండ్రి మరణించడంతో 2006లో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009లో ఆయన రెండోసారి ఆయన విశాఖ దక్షిణ స్థానం నుండి గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012 ఫిబ్రవరి 9వ తేదీన ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమితులయ్యారు. ద్రోణంరాజు శ్రీనివాస్ మృతిపట్ల ఆయన పలువురు వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్