ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి ఫోన్ కొనిస్తే..చివరకు
కరోనా పేద, మధ్యతరగతి ప్రజలకు తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఒకవైపు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పిల్లల చదువులు వారి మెడకు గుదిబండగా మారాయి.

కరోనా పేద, మధ్యతరగతి ప్రజలకు తీసుకొచ్చిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఒకవైపు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు పిల్లల చదువులు వారి మెడకు గుదిబండగా మారాయి. పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేకపోవడంతో విద్యావిధానం ఆన్లైన్ ద్వారానే కొనసాగుతోంది. దీంతో తప్పనిసరిగా మొబైల్ ఫోన్స్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ముందు నార్మల్ ఫోన్స్ తో ముందుకు నెట్టుకుపోయినవారు కూడా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ కొన్నారు. అయితే పిల్లలు చదువుల కోసం కాకుండా గేమ్స్ కోసం సదరు మొబైల్స్ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోని పక్కదారి కూడా పడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలోని కియోంజర్‌లో జరిగింది. (చిక్కిపోయిన కీర్తి, షాకవుతోన్న ఫ్యాన్స్)
జోడా పారిశ్రామిక నగరంలోని కమర్జోడా మురికివాడకు చెందిన వినోద్ అపాట్ అనే వ్యక్తి కొడుకు అమితాన్షు అపాట్(14).. సరస్వతి శిశు మందిర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసం తన తండ్రి అతనికి రూ.13,000తో ఓ ఫోన్ కొనిచ్చాడు. తరగతులకు హాజరవుతూనే ఫోన్‌ను మరో విధంగా ఉపయోగించిన అమితాన్షు ‘ఫ్రీ ఫైర్’ గేమ్‌కు బానిసయ్యాడు. ముందుగా తన తండ్రి బ్యాంకు ఖాతా నుంచి.. గేమ్‌లో ఉండే కొత్త ఫీచర్ల కోసం రూ. 35,000 కట్టాడు. తర్వాత తన తల్లి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 61,000 దాకా గేమ్ కోసం ఖర్చు చేశాడు. ఈ విషయం తెలిస్తే తండ్రి తనను ఏమంటాడో అని భావించిన అమితాన్షు ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తన తల్లి చీరతో బాత్రూంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. (విజయవాడలో ప్రజల ప్రాణాలతో మటన్ మాఫియా చెలగాటం)




