మీకెే భాషొచ్చు? బ్యాంకు పరీక్షకు నో రూల్!
బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే రాయాల్సి వస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీలో వెనకబడిపోతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. త్వరలో బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. ఇకపై 13 […]
బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే రాయాల్సి వస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటీలో వెనకబడిపోతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
త్వరలో బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్.. ఇకపై 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంకు పరీక్షలు నిర్వహించనుంది. దీనివలన ఎందరో విద్యార్థులకు లబ్ది చేకూరే అవకాశం ఉంది.