లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలు గడించాయి. రేపు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న సందర్భంగా సూచీలు కూడా సానుకూలంగా ట్రేడయ్యాయి. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,946 వద్ద, సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 39,908 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. భారతీ ఎయిర్‌ టెల్‌, టాటామోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ల షేర్లు లాభపడ్డాయి. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల సూచీ బాగా లాభపడింది. లోహ, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. యూనిప్లే ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు […]

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2019 | 4:37 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలు గడించాయి. రేపు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న సందర్భంగా సూచీలు కూడా సానుకూలంగా ట్రేడయ్యాయి. నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో 11,946 వద్ద, సెన్సెక్స్‌ 68 పాయింట్ల లాభంతో 39,908 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. భారతీ ఎయిర్‌ టెల్‌, టాటామోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ల షేర్లు లాభపడ్డాయి. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల సూచీ బాగా లాభపడింది. లోహ, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. యూనిప్లే ఇండస్ట్రీస్‌ షేర్లు దాదాపు 5శాతం లాభపడ్డాయి. ఈ సంస్థను కువైట్‌కు చెందిన మర్కాబ్‌ క్యాపిటల్‌ అనే సంస్థ కొనుగోలు చేయనున్నట్లు సమాచారం రావడంతో ఈ కౌంటర్‌లో భారీగా కొనుగోళ్లు జరిగాయి. నేడు ఇండియా మార్ట్‌ షేర్లు లాభాలతో లిస్టయ్యాయి. ఈ షేరు ఇష్యూ ధర రూ.973 లిస్టింగ్‌లో ఇది రూ.1,180.21 వద్దకు వెళ్లింది.