AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివేకా హత్యకేసులో నార్కో పరీక్షలు

వైసీపీ నేత, సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్టులకు రెడీ అయ్యారు సిట్ అధికారులు. రెండున్నర నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈకేసుపై సీరియస్‌గా ద‌ృష్టి సారించింది. దీంతో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ..అసలు వివేకాను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? నిందితుల వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో […]

వివేకా హత్యకేసులో నార్కో పరీక్షలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 04, 2019 | 5:44 PM

Share

వైసీపీ నేత, సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్టులకు రెడీ అయ్యారు సిట్ అధికారులు. రెండున్నర నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఈకేసుపై సీరియస్‌గా ద‌ృష్టి సారించింది. దీంతో దూకుడు పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ..అసలు వివేకాను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? నిందితుల వెనుక ఎవరున్నారు అనే విషయాలపై ఆరా తీస్తోంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన ఆయన ఇంటి వాచ్‌మెన్ రంగయ్యకు నార్కో టెస్టు, మరో నిందితుడు దుద్దెకుంట శేఖర్‌లకు లై డిటెక్టర్ టెస్టులు చేయాలని నిర్ణయింది సిట్. నార్కో పరీక్షలు చేయాలన్న సిట్ విఙ్ఞప్తిని గతంలో పులివెందుల కోర్టు తిరస్కరించింది అయితే తాజగా అదే కోర్టు నార్కో పరీక్షలకు ఓకే చెప్పింది. దీనికోసం నిందితుడు రంగయ్యను హైదరాబాద్‌కు తరలించారు. మరో నిందితుడు శేఖర్‌కు సంబంధించి కోర్టు అనుమతి రావాల్సి ఉంది. మరోవైపు ఇదే కేసులో ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌లకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై మార్చి 28న పోలీసులు వారిని అరెస్ట్ చేయగా ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్‌లో ఉన్నారు.

మార్చి 15న వైఎస్ వివేకా హత్య జరగగా ముందు ఆయన గుండెపోటుతో చనిపోయారని భావించినా.. పోస్ట్‌మార్టమ్‌లో కత్తులతో నరికి చంపినట్లు తేలింది. ఈ హత్యకేసుపై అప్పటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు సరైన ఆధారాలు లభించలేదు. హత్య జరిగిన రోజునుంచి కేసు దర్యాప్తుపై వివేకా కుమార్తె సునీత అనేక అనుమానాలు సైతం వ్యక్తం చేశారు. తాజాగా ఈ హత్యకేసులో సిట్ స్పీడ్ పెంచింది.

Follow Us
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం 'పింక్ పవర్ రన్ 3.0'..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?